Nihal: వినూత్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సందిగ్ధం డేట్ ఫిక్స్
Sandidgham poster
నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి, నవీన్ రాజ్ సంకరపు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సందిగ్ధం. పార్థసారధి కొమ్మోజు దర్శకుడు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడా టీం కంప్లీట్ చేసింది. తీర్థ క్రియేషన్స్ బ్యానర్ పై సంధ్య తిరువీధుల నిర్మాణంలో ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టి సెన్సార్ వద్దకు వెళ్లనుంది. మే 29న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు టీం ముహూర్తం ఫిక్స్ చేసింది.
ఈ మూవీకి గౌతమ్ రవి రామ్ సంగీతాన్ని అందించారు. నందన్ కృష్ణ కెమెరామెన్‌గా, విశ్వన్ రాజ్. డిఎస్ ఎడిటర్‌గా పని చేశారు. జీవా కొచెర్ల, నవీన్ రాజ్ సంకరపు, చిట్టి బాబు, ఆనంద్ భారతి, రైజింగ్ రాజు, అప్పారావు, నాగిరెడ్డి, శ్రీదేవీ, దుర్గ, లక్ష్మీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
నటీనటులు : నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి, జీవా కొచెర్ల, నవీన్ రాజ్ సంకరపు, చిట్టి బాబు, ఆనంద్ భారతి, రైజింగ్ రాజు, అప్పారావు, నాగిరెడ్డి, శ్రీదేవీ, దుర్గ, లక్ష్మీ తదితరులు
