రోడ్డుపై కనిపించిన దెయ్యం.. (ఫోటో వైరల్)
Ghost
అక్కడ చాలామంది ప్రయాణీకులు బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. ఆ నగరం పర్యాటక నగరం కావడంతో అక్కడ పర్యాటకులకు సైట్ సీయింగ్ కోసం గైడ్లు వుంటారు. అలాంటి ఓ టూర్ గైడ్.. బస్టాప్ దగ్గర ఓ ఫోటో తీశాడు. అందులో ఓ మహిళ మాత్రం అతనికి షాక్ ఇచ్చింది.
ఆ ఫోటోలో ఆమె కాళ్ళలోంచి రోడ్డు కనిపిస్తోంది. రోడ్డుపై వున్న తెల్లటి గీత.. ఆమె కాళ్ళల్లోంచి కనిపిస్తోంది. ఫోటో తీసినప్పుడు దాన్ని అతను గమనించలేదు. తీరా గమనిస్తే ఆమె కాళ్ళ నుంచి రోడ్డుపై నుంచి గీతలు కనిపిస్తున్నాయి.
ఈ ఘటన అతనిని ఆశ్చర్య పరిచింది. ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాక.. చాలామంది ఆశ్చర్యపోయారు. చాలామంది షాకయ్యారు. కొంత మంది మాత్రం ఇందులో షాకింగ్ లేదని.. కెమెరా ట్రిక్స్ అంటున్నారు.
