సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 12 ఏప్రియల్ 2021 (14:51 IST)

అల్లు అర్జున్ బామ్మ‌ర్ది ‘బతుకు బస్టాండ్’ లుక్

విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయం అవుతున్న సినిమా `బతుకు బస్టాండ్`. నికిత అరోరా, శృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల ఫిల్మ్స్ పతాకంపై చక్రధర్ రెడ్డి సమర్పణలో IN రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యే అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా బతుకు బస్టాండ్ టీమ్ విడుదల చేసిన ట్రిబ్యూట్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బతుకు బస్టాండ్ హీరో విరాన్ ముత్తంశెట్టి అల్లు అర్జున్ కు స్వయానా బావమరిది. ఈ సినిమాను కవితా రెడ్డి, కె.మాధవి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయింది.

హీరో విరాన్, హీరోయిన్ నికిత అరోరా ఇద్దరు చాలా రొమాంటిక్ గా చేతులు పట్టుకుని కూర్చున్నారు. ఈ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు వాస్ కమల్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మహవీర్ సంగీతం సమకూరుస్తున్నారు. జూన్ లో ‘బతుకు బస్టాండ్’ సినిమా విడుదల కానుంది.  
సమర్పణ : K చక్రధర్ రెడ్డి, రచన, దర్శకత్వం : I.N. రెడ్డి, నిర్మాతలు : I.కవితా రెడ్డి, K.మాధవి, కెమెరాః వాస్ కమల్‌, సంగీతం : మహవీర్, కొరియోగ్రఫీ : శివాజీ, యాక్షన్ : శంకర్.U