బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (17:15 IST)

దెయ్యాన్ని చూశారా? ఐతే కాస్త మహబూబాబాద్ వెళ్ళిరండి..

Ghost
దెయ్యంను ఎప్పుడైనా చూశారా? అయితే మహబూబాబాద్‌ జిల్లాకు వెళ్ళిరండి. ఎందుకంటే అక్కడే తెల్లని ముసుగతో.. స్లో మోషన్ నడకతో.. చూడగానే భయపడేలా ఓ దెయ్యం కనిపిస్తుందట. ఈ దెయ్యం మహబూబాబాద్ జిల్లా జంగిలిగొండ గ్రామశివారులోని గుట్టల వద్ద తిరుగుతోంది. ఎవరో కావాలని చేస్తున్నారని చాలా క్లియర్‌గా తెలుస్తున్నా సరే.. ఈ దృశ్యాలు చూసిన జనాలు భయపడుతున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. జంగిలిగొండ స్టేజీ నుంచి వీఎస్ లక్ష్మీపురం, నర్సింహులపేట, కౌసల్యాదేవిపల్లి గ్రామాలకు ఈ రోడ్డు మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. అయితే, గత 15 రోజులుగా ఈ ప్రాంతంలో దెయ్యం తిరుగుతోందని ప్రచారం జరగడంతో.. రాత్రిళ్లు బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. చివరికి పొలాలకు వెళ్లాలన్నా సరే స్థానికులు వణికిపోతున్నారు.
 
ఊరిలోనివారి వాట్సాప్ గ్రూపులో వైరల్ అవుతున్న దెయ్యం వీడియో ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. వాస్తవానికి ఇది ఎవరో ఆకతాయిలు ఉద్దేపూర్వకంగా చిత్రించిన ఫ్రాంక్ వీడియోలా ఉంది. ఈ వీడియో గ్రామస్తులకు నిద్రలేకుండా చేస్తోంది. రోడ్డుపై అర్ధరాత్రి దెయ్యం తిరుగుతున్నట్లు వీడియో షూట్ చేసి గ్రామంలోని వాట్సాప్ గ్రూప్‌లో వైరల్ చేశారు. దీంతో గ్రామప్రజలు దెయ్యం భయంతో వణికిపోతున్నారు. దీనిని అధికారులు పరిష్కరించాలని గ్రామప్రజలు కోరుతున్నారు.
 
ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు, అధికారులు వచ్చి.. తమ ప్రాంతాన్ని సందర్శించి.. వైరల్ అవుతున్న ఈ దెయ్యం సంగతి చూడాలని అభ్యర్థిస్తున్నారు. అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి.. భయాలను పోగొట్టాలని వేడుకుంటున్నారు.