మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 ఏప్రియల్ 2021 (08:49 IST)

కరోనా సెకండ్ వేవ్.. డబుల్ మాస్క్ ధరిస్తే.. ఎంత మేలో తెలుసా..?

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ వైరస్ నుంచి తప్పించుకోవాలంటే.. డబుల్ మాస్క్ ధరించడం వల్ల కరోనా వైరస్‌ నుంచి ఎక్కువ రక్షణ పొందుతాము. వైరస్ సంక్రమించే అవకాశాలు తక్కువగా ఉంటాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది.

డబుల్ మాస్క్ ధరించడం వల్ల 96.4 శాతం కరోనా బారినపడే అవకాశాలు తక్కువగా ఉంటాయని వెల్లఢించారు. సాధారణంగా డబుల్ మాస్క్ అంటే.. ఒక వ్యక్తి ఒకేసారి రెండు మాస్కులను ధరించడం. డబుల్ మాస్క్ వేసుకోవడం ద్వారా గాలిలో ఉండే వైరస్ సంక్రమించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది.
 
రద్దీగా ఉండే ప్రాంతాలు.. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, పార్కులు, సినిమా థియేటర్లు వంటి ప్రదేశాల్లో డబుల్ మాస్క్ ధరించాలి. మాస్కులను ప్రతిరోజు వేడి నీటితో శుభ్రంగా కడగాలి. మాస్కులను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. ఎన్-95 మాస్కులు తీసుకోవడం ఉత్తమం. వాడిన మాస్కులనే వాడకుండా.. కొద్ది రోజులకు కొత్త మాస్కులను కొనుగోలు చేయాలి. అప్పుడే వైరస్‌ వ్యాప్తిని నియంత్రించవచ్చు.