సంబంధిత వార్తలు
- భార్యపై అనుమానం... నాకు పుట్టలేదనీ కన్నబిడ్డ ప్రాణాలు తీసిన కసాయి తండ్రి
- శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తిరుగుతున్నది చిరుత కాదు.. అడవి పిల్లి
- బాలికపై అకృత్యం.. పూల వ్యాపారి దారుణం.. మూడు నెలల పాటు నరకం..
- ఇంట్లోకి ప్రవేశించిన నల్లత్రాచు... చిన్నారులు మాత్రమే వుండటంతో..
- ఆటో ఎక్కితే బలాత్కారం చేయబోయాడు.. తప్పించుకుని..?
హైదరాబాద్ శివార్లలో భారీగా కేసులు.. వందమంది పైగా పాజిటివ్, లాక్డౌన్
తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. అలాగే హైదరాబాద్ శివార్లలో సైతం కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. శంషాబాద్ మున్సిపాలిటీలో కరోనా కలకలం రేపింది. గొల్లపల్లిలో ఏకంగా వంద మందికి పైగా కరోనా బారిన పడ్డారు. వీరిలో ముగ్గురు మృతి చెందారు. ఇటీవల వ్యవసాయ శాఖ నిర్వహించిన రైతు సదస్సులో వీరంతా పాల్గొనడం ద్వారా వీరికి కోవిడ్ సోకిందని స్థానికులు అంటున్నారు.
గొల్లపల్లి గ్రామంలో పరీక్షలు నిర్వహించగా వంద మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. మరోవైపు గొల్లపల్లితో పాటు శంషాబాద్‌లోని వివిధ గ్రామాల్లో పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది.
ఇప్పటికే చిన్న గోల్కొండ ప్రభుత్వ పాఠశాలలోని పలువురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. పాలమాకుల పాఠశాలలోనూ ఇరవై మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. అయితే వంద మందికి కరోనా కేసులు నమోదు కావడంతో.. గొల్లపల్లి గ్రామస్థులు స్వచ్ఛంధంగా లాక్‌డౌన్ విధించుకున్నారు.
