శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (09:39 IST)

బాలికపై అకృత్యం.. పూల వ్యాపారి దారుణం.. మూడు నెలల పాటు నరకం..

మహిళలపై దేశంలో అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నిర్భయ, దిశ లాంటి చట్టాలు వచ్చిన వయోబేధం లేకుండా అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బాలికపై యజమాని మూడు నెలల పాటు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పూల దుకాణం యజమాని ఓ బాలికపై మూడు నెలల పాటు లైంగిక దాడికి పాల్పడిన ఘటన శంషాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ హుడా కాలనీకి చెందిన 14 ఏళ్ల బాలిక సతీష్ అనే 40 ఏళ్ల పూల దుకాణంలో కొంతకాలంగా పనిచేస్తోంది. బాలికను బైక్‌పై ఇంటి వద్ద వదిలేసే క్రమంలో మూడు నెలలుగా బాలికపై లైంగిక దాడి చేస్తున్నాడు. 
 
ఇటీవల అనారోగ్యంతో ఉన్న సమయంలో కూడా దారుణానికి ఒడిగట్టేందుకు యత్నించడంతో బాలిక అఘాయిత్యాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలకార్మికురాలిని పనిలో పెట్టుకోవడంతో పాటు అత్యాచారానికి ఒడిగట్టిన అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.