సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (15:40 IST)

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్

కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీకి క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. కోవిడ్ ప‌రీక్ష‌లో ఆయ‌న పాజిటివ్‌ అని తేలింది. స్వ‌ల్ప స్థాయిలో ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు రాహుల్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. అయితే కోవిడ్ ప‌రీక్ష చేయించుకుంటే పాజిటివ్‌గా వ‌చ్చిన‌ట్లు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
ఈ మధ్యాకంలో తనతో కాంటాక్ట్‌లో ఉన్న వాళ్లు అంతా కోవిడ్ ప్రోటోకాల్ ప్ర‌కారం ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని రాహుల్ కోరారు. అంద‌రూ సుర‌క్షితంగా ఉండాల‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.
 
ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన అయిదు రాష్ట్రాల్లో ఆయ‌న ప్ర‌చారంలో పాల్గొన్నారు. అయితే బెంగాల్‌లో జ‌ర‌గాల్సిన చివ‌రి మూడు ద‌శ‌ల ఎన్నిక‌ల ప్ర‌చారం నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు కూడా ఆయ‌న చెప్పిన విష‌యం తెలిసిందే.