మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (11:28 IST)

మోత్కుపల్లికి కరోనా వైరస్ : పరిస్థితి విషమం

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన మోత్కుపల్లి నరసింహులుకు క‌రోనా సోక‌డంతో ఆయ‌న‌ను హైద‌రాబాద్‌, సోమాజిగూడ‌లోని యశోద ఆసుపత్రిలో చేర్చారు. అయితే, నిన్న రాత్రి ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఐసీయూకి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఆయ‌న‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అప్ప‌ట్లో టీడీపీ హయాంలో ఆయ‌న‌ మంత్రిగా పనిచేసిన విష‌యం తెలిసిందే. 2008లో ఆయ‌న‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
 
రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం కొన్నేళ్లు టీడీపీలో కొన‌సాగిన ఆయ‌న అనంత‌రం ఆ పార్టీకి వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేసి హాట్ టాపిక్‌గా మారారు. దీంతో ఆయ‌న‌ను టీడీపీ అప్ప‌ట్లో పార్టీ నుంచి బ‌హిష్క‌రించింది. అనంత‌రం ఏపీలో టీడీపీ ఓడిపోవాల‌ని ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఏడాది జనవరిలో ఆయన బీజేపీలో చేరారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.