మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (09:26 IST)

ఢిల్లీలో మన్మోహన్ - హైదరాబాద్‌లో కేసీఆర్ :: కరోనా పాజిటివ్

భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని.. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రముఖులంతా ఆకాంక్షించారు. మన్మోహన్‌ అనారోగ్యం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
 
'మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాను' అని మోడీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం మన్మోహన్‌ను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. 
 
కొవిడ్ నియంత్రణపై పలు సూచనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఆదివారమే ఆయన లేఖ రాసిన విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు సైతం కరోనా బారినపడ్డారు.
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ముఖ్యమంత్రికి కరోనా సోకిందని సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. ఆయన స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని తెలిపారు. కాగా, హోం ఐసోలేషన్ లో ఉండాలని కేసీఆర్ కు వైద్యులు సూచించారు. 
 
ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం ఎప్పటికిప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తోందని సీఎస్ సోమేశ్ కుమార్ వివరించారు. రెండు వారాల కిందట సీఎస్ సోమేశ్ కుమార్ కు కరోనా పాజిటివ్ వచ్చింది.