బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 19 ఏప్రియల్ 2021 (19:42 IST)

సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్, హోం క్వారెంటైన్లో...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా స్వల్ప లక్షణాలు వున్నట్లు సీఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం సీఎం హోం క్వారెంటైన్లో చికిత్స తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కరోనా పరీక్షలు చేశామనీ, అందులో పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు సోమవారం సాయంత్రం ప్రధాన కార్యదర్శి ఇచ్చిన అధికారిక నోట్‌లో పేర్కొన్నారు.
 
ముఖ్యమంత్రికి తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, తన ఫామ్‌హౌస్‌లో హోం క్వారంటైన్లో ఉన్నారని ముఖ్య కార్యదర్శి తెలిపారు. వైద్యుల బృందం ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది.
 
 కాగా ఇటీవలే తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన చికిత్స చేయించుకుని నెగటివ్ రిపోర్టుతో బయటకు వచ్చారు. తాజాగా నాగార్జున ఉపఎన్నిక సమయంలో కేసీఆర్ భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ఆయనకు అక్కడ కరోనా సోకి వుంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో కేసుల పెరుగుదల కనిపిస్తోంది. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న జిల్లాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మరియు పరిసర జిల్లాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి.
 
 రాష్ట్ర రాజధానిలో 705 కొత్త కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ ప్రక్కనే ఉన్న మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాలో వరుసగా 363, 336 కేసులు నమోదయ్యాయి.