శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (19:36 IST)

భారత్‌ నుంచి రాకపోకలకు నిషేధం.. పాకిస్థాన్ కూడా ఆ లిస్టులో..?

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ఇప్పటికే అమెరికా, బ్రిటన్, హాంకాంగ్ దేశాలు భారత్ నుంచి తమ దేశాలకు రాకపోకలపై నిషేధం విధించగా.. తాజాగా పాకిస్థాన్ ఆ జాబితాలో చేరిపోయింది. భారత్‌లో కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయినందున ఇక్కడి నుంచి తమ దేశానికి ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
 
కాగా, దేశంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 1.50 కోట్లు దాటిందని, కేవలం గత 15 రోజుల వ్యవధిలోనే దాదాపు 25 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 19 లక్షల మార్కు దాటిందని వెల్లడించింది. 
 
దేశవ్యాప్తంగా నమోదైన కరోనా మరణాల సంఖ్య కూడా ప్రస్తుతం 1.80 లక్షలు దాటింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 2.73 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే పొరుగు దేశాలు భారత్‌కు రాకపోకలపై నిషేధం విధిస్తున్నాయి.