1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Janasena Kalyan comments on Yamini Sadhineni, She went out from discussion

మల్లెపూల యామిని... నీ సీక్రెట్? లైవ్‌లో కల్యాణ్.... ఏడ్చుకుంటూ వెళ్లిపోయిన యామిని...

Janasena
పార్టీల సంగతి ఏమోగానీ యామిని సాధినేని ఏ డిస్కషన్‌లో పాల్గొన్నా ఆమెను మాత్రం మల్లెపూలు వదలడం లేదు. ఏంటి ఈ మల్లెపూలు సంగతి అనుకుంటున్నారా... గతంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పైన యామిని సాధినేని విమర్శలు గుప్పిస్తూ... పవన్ మల్లెపూలు నలపాల్సిందే కానీ ఏమీ చేయలేరు అంటూ సెటైర్లు వేశారు. ఇక అప్పట్నుంచి ఆమెను జనసైనికులు వదలడంలేదు. వీలు దొరికితే చాలు మల్లెపూలు గురించి మాట్లాడుతున్నారు. 
 
తాజాగా లైవ్‌లో ఓ చర్చా కార్యక్రమం నడుస్తుండగా జనసేన అధికార ప్రతినిధి కల్యాణ్ మాట్లాడుతూ.... మల్లెపూల యామినీ... నీ సీక్రెట్ చెప్పమంటావా అంటూ ఇంకా వాదనకు దిగాడు. దీనితో మైకును పీకేసి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు సాధినేని యామిని. ఇంగిత జ్ఞానం లేనివాళ్లను చర్చకు ఎందుకు పిలుస్తున్నారంటూ సదరు చర్చా నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కూర్చోమని చెప్పినా వినకుండా ఆమె అక్కడి నుంచి నిష్క్రమించారు.
తర్వాతి కథనం
నిరుద్యోగి.. రేప్ చేసే ముందు కాళ్లు తొలగిస్తాడు..