సంబంధిత వార్తలు
- సారీ చెబుతావా.. కోర్టుకు లాగమంటావా? శృతికి అర్జున్ వార్నింగ్
- గూగుల్‌లో 'మీటూ' ప్రకంపనలు... 48 మంది ఉద్యోగులుపై వేటు
- ఆ వ్యక్తి నన్ను రేప్ చేయబోయాడు : బాంబు పేల్చిన హీరోయిన్ తల్లి
- వైరముత్తుపై చిన్మయ ఆరోపణలు నిజమేకావొచ్చు... రెహ్మాన్ పేరునూ వాడుకున్నారు...
- ఎంతగా ప్రతిఘటించినా ఆ మానవమృగాన్ని ఆపలేక పోయా...
హౌజ్‌ఫుల్-4 సెట్స్‌లో అలా జరిగిందా?
దేశంలో మీ టూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లైంగిక వేధింపులకు గురైన మహిళలు నిర్భయంగా తమ చేదు అనుభవాలను బహిర్గతం చేస్తున్నారు. తాజాగా... హౌజ్‌ఫుల్-4 సినిమా షూటింగ్ సమయంలో కొంతమంది వ్యక్తులు తనపై లైంగిక దాడికి ప్రయత్నించారంటూ ఓ మహిళా జూనియర్ ఆర్టిస్టు ఆరోపించారు.
హీరోలు అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్ సెట్లో ఉన్న సమయంలోనే తాను ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నానని చెప్పడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ వివాదంపై వివరణ ఇచ్చారు. సదరు జూనియర్ ఆర్టిస్టు స్నేహితుడికి సినిమాతో ఎలాంటి సంబంధం లేదు. జూనియర్ ఆర్టిస్టు స్నేహితుడికి డాన్స్‌మాస్టర్‌కు గొడవ జరిగిన మాట వాస్తవమేనని చెప్పారు.
కానీ ఆ సమయంలో అక్షయ్, రితేశ్ అక్కడ లేరని ఎగ్జిక్యూటివ్ నిర్మాత స్పష్టం చేశాడు. వ్యక్తిగత విషయాల కారణంగా జరిగిన గొడవను సినిమా యూనిట్‌కు ఆపాదించాలని ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
గొడవ జరిగిన సమయంలో తన అసిస్టెంట్ అక్కడే ఉన్నారని.. జూనియర్ ఆర్టిస్టు చెబుతున్నట్లుగా ఆమెను ఎవరూ లైంగిక వేధించలేదని తనతో చెప్పినట్లు వెల్లడించాడు. ఇప్పటికే వివిధ కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతుంటే.. సంబంధంలేని విషయాల్లో కూడా ఇలా తమను ఇరికించడం సరికాదని చెప్పుకొచ్చారు.
తర్వాతి కథనం
