సంబంధిత వార్తలు
- స్పెషల్ స్టేటస్ డిమాండ్ : వైకాపా ఎంపీల రాజీనామాలు ఆమోదం
- ఇసుక మాఫియాను ''లోకేష్ ర్యాంప్'' అని పిలుస్తున్నారు: జగన్
- నారా లోకేష్ నిజాలు మాట్లాడేస్తున్నారని బాబు ట్విట్టర్లో కూర్చోబెట్టారు: రోజా ఎద్దేవా(Video)
- చంద్రబాబు ఇంటికి కేజీ బంగారం... బెంజికారు ఇస్తానంటారు... నమ్మేద్దామా? జగన్ ప్రశ్న
- నిప్పుల్లో దూకేందుకు సిద్ధమంటున్న నటుడు పృథ్వి
జగన్ మోడీ రెడ్డి... వైకాపా అధినేతకు పేరు పెట్టిన లోకేశ్
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఏపీ మంత్రి నారా లోకేశ్ సరికొత్త పేరు పెట్టారు. ఇకపై జగన్ పేరును ఇకపై జగన్ మోడీ రెడ్డిగా మారిందనీ ఆయన చెప్పారు.
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఏపీ మంత్రి నారా లోకేశ్ సరికొత్త పేరు పెట్టారు. ఇకపై జగన్ పేరును ఇకపై జగన్ మోడీ రెడ్డిగా మారిందనీ ఆయన చెప్పారు.
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తుమ్మిశిలో పర్యటించిన లోకేశ్ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాలుగేళ్లు ఏపీకి కేంద్ర సర్కారు ద్రోహం చేసిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురించి జగన్, పవన్ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని అన్నారు.
కానీ, 68 యేళ్ల వయసులో మన కోసం, రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న టీడీపీ అధినేత, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునిపై పొద్దస్తమానం విమర్శల వర్షం గుప్పిస్తున్నారనీ ఆరోపించారు.
మోడీపై విమర్శలు చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని జగన్‌కు భయం పట్టుకుందని నారా లోకేశ్ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి పేరు మారిందని, ఇప్పుడు ఆయన పేరు జగన్ మోదీ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో 25కి 25 లోక్‌సభ సీట్లు సాధిస్తామని లోకేశ్ ధీమా వ్యక్తంచేశారు.
