శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 16 జూన్ 2018 (10:27 IST)

నిప్పుల్లో దూకేందుకు సిద్ధమంటున్న నటుడు పృథ్వి

'థర్టీ ఇయర్ ఇండస్ట్రీ' ఇక్కడ అనే డైలాగ్‌తో పాపులర్ అయిన నటుడు పృథ్వి. ఈయన ఇటీవల వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో పాల్గొని తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఇపుడు జగన్ కోసం నిప్పుల్లో

'థర్టీ ఇయర్ ఇండస్ట్రీ' ఇక్కడ అనే డైలాగ్‌తో పాపులర్ అయిన నటుడు పృథ్వి. ఈయన ఇటీవల వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో పాల్గొని తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఇపుడు జగన్ కోసం నిప్పుల్లో దూకమన్నా దూకుతానంటూ ప్రకటించారు.
 
ఆయన తాజా ఇచ్చి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని చెప్పారు. తాను 2014 వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని పార్టీ గెలుపుకోసం అధ్యక్షుడు ఏ పని చెబితే అది చెయ్యడానికి సిద్ధమన్నారు. 
 
వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గంనుంచి అయినా పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ.. 'ప్రస్తుతం పోటీ చేసే స్థానాలు ఖాళీగా లేవని ఒకవేళ తనను పోటీకి దిగాలని అధినేత సూచిస్తే తప్పకుండా బరిలో ఉంటానని అన్నారు. అంతేకాదు అయన కోసం, పార్టీ  గెలుపుకోసం నిప్పుల్లో దూకమన్నా దూకుతాను' అని ప్రకటించారు.