శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Srinivas
Last Modified: బుధవారం, 13 జూన్ 2018 (14:29 IST)

మిస్టర్ కిమ్... నా కారు చూడు... ట్రంప్ కళ్ల సైగతో...

నిన్నటిదాకా సై అంటే సై అన్న కిమ్, ట్రంప్‌లు ఇద్దరూ సింగపూర్ భేటీ సందర్భంగా కెపెల్లా హోటల్‌లోని పచ్చికబయళ్లలో చెట్టపట్టాలేసుకొని కలియదిరిగారు. ఆ సమయంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, కిమ్‌కు ఎన్నో ప్రత్యేకతలున్న తన వాహనం బీస్ట్‌ను దగ్గరుండి చూపించారు.

నిన్నటిదాకా సై అంటే సై అన్న కిమ్, ట్రంప్‌లు ఇద్దరూ సింగపూర్ భేటీ సందర్భంగా కెపెల్లా హోటల్‌లోని పచ్చికబయళ్లలో చెట్టపట్టాలేసుకొని కలియదిరిగారు. ఆ సమయంలోనే  అమెరికా అధ్యక్షుడు ట్రంప్, కిమ్‌కు ఎన్నో ప్రత్యేకతలున్న తన వాహనం బీస్ట్‌ను దగ్గరుండి చూపించారు. కారు వద్దకు రాగానే ట్రంప్ కనుసైగ చేయడం ద్వారా వాహనం తలుపులు తెరిచారు అధికారులు. 
 
సాధారణంగా ఇతరులెవరనీ ఆ వాహనం దరిదాపుల్లోకి కూడా రానివ్వరు సీక్రేట్ ఏజెంట్ అధికారులు. కానీ కిమ్ కారు లోపలి భాగాలన్నీ ఆసక్తిగా గమనించారు. దాని ప్రత్యేకతలన్నీ తెలుసుకున్నారు. బీస్ట్  ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైనది వాహనంగా ప్రత్యేకత సంతరించుకుంది. ఎనిమిది టన్నుల బరువుండే బీస్ట్ రసాయన దాడులను కూడా తట్టుకుంటుంది. బోయింగ్ 757 తలుపులను పోలి ఉండే వాటిని ఈ బీస్టుకు అమర్చారు. ఎటువంటి పేలుడునైనా తట్టుకొనే ఇంధనం ట్యాంక్‌ ఈ కారు సొంతం కావడం విశేషం.