మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 12 జూన్ 2018 (09:50 IST)

రాకాసిగా మారిన బేబీ సిట్టర్.. పిడిగుద్దులు.. సెల్‌ఫోన్‌తో పసివాడి తలకేసి బాదింది..?

ఆధునికత పేరిట ఆలుమగలూ ఉద్యోగాల కోసం పరుగులు తీస్తున్న ఈ కాలంలో తల్లిదండ్రుల చేతుల మీదుగా పిల్లల పెంపకం కుదరట్లేదు. చిన్నకుటుంబాలు ఏర్పడటంతో పిల్లలను పెంచేందుకు ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. డేకేర్‌లు,

ఆధునికత పేరిట ఆలుమగలూ ఉద్యోగాల కోసం పరుగులు తీస్తున్న ఈ కాలంలో తల్లిదండ్రుల చేతుల మీదుగా పిల్లల పెంపకం కుదరట్లేదు. చిన్నకుటుంబాలు ఏర్పడటంతో పిల్లలను పెంచేందుకు ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. డేకేర్‌లు, బేబీ సిట్టర్‌ల వెంట పడాల్సి వస్తుంది. అయితే డేకేర్, బేబీ సిట్టర్లు పిల్లలను ఎలా చూసుకుంటున్నారో.. వారిని నమ్మి చిన్నారులను అప్పగించడం ఎంతవరకు సబబు కాదో ఈ ఘటనను చూస్తే అర్థం చేసుకోవచ్చు.
 
వివరాల్లోకి వెళితే, చైనాలో ఓ మహిళ వ్యక్తిగత పనుల రీత్యా.. తన ఎనిమిది నెలల బాబును బేబీ సిట్టర్‌కు అప్పగించింది. తల్లిని విడిచి పెట్టలేని ఆ పసివాడు ఏడుపు ఆపలేదు. లిఫ్టులో బిడ్డను తీసుకెళ్తూ బేబీ సిట్టర్ ఏం చేసిందంటే.. గుక్కపట్టి ఏడుస్తున్న బాబుపై దారుణానికి పాల్పడింది. గుక్కపెట్టి ఏడ్చే పసివాడిని.. లిఫ్ట్ డోర్స్ క్లోజ్ చెయ్యగానే తనలోని క్రూరత్వాన్ని బయటకు తీసింది. 
 
ఏడుస్తున్న బాబుపై ఒక్కసారిగా పిడిగుద్దులతో దాడి చేస్తూ.. చేతిలో ఉన్న సెల్ ఫోన్‌తో బాబు తలపై కొట్టింది. ఇంకా పొట్టపైనే పిడిగుద్దులతో నరకం చూపించింది. దీంతో బాబు గుక్కపట్టిఏడ్చాడు. లిఫ్ట్‌లో సీసీ కెమెరాలు ఉండటంతో ఆ మహిళ బాగోతం బయటపడింది.