మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 జూన్ 2018 (13:47 IST)

ముక్కులోకి వెళ్లిన జలగ... ఎలా బయటకు తీశారో చూడండి (వీడియో)

చైనాకు చెందిన ఓ వ్యక్తి ముక్కులోకి ఆయనకు తెలియకుండానే జలగ వెళ్లిపోయింది. దీంతో ఓ వారం రోజులుగా ఆయన ముక్కు నుంచి రక్తం ధారగా ప్రహించ సాగింది. దీంతో పలువురు వైద్యుల వద్ద చూపించినప్పటికీ ఫలితం లేకుండా పో

చైనాకు చెందిన ఓ వ్యక్తి ముక్కులోకి ఆయనకు తెలియకుండానే జలగ వెళ్లిపోయింది. దీంతో ఓ వారం రోజులుగా ఆయన ముక్కు నుంచి రక్తం ధారగా ప్రహించ సాగింది. దీంతో పలువురు వైద్యుల వద్ద చూపించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఓ ఈఎన్టీ స్పెషలిస్టు వద్దకు వెళ్లగా ఆయన స్కాన్ తీసి షాక్ తిన్నారు.
 
రక్తాన్ని పీల్చే జలగ అతని ముక్కులో చేరినట్లు గుర్తించాడు. వెంటనే దానిని బయటకు తీశాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ముక్కులోని నుంచి తీసిన జలగ నాలుగు అంగుళాల పొడవువుంది. ఈ వీడియోను ఇప్పటికే 12 లక్షల మంది చూశారు.