గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 10 జూన్ 2018 (16:35 IST)

ఉలి - సుత్తి సాయంతో పన్ను పీకిన నకిలీ వైద్యుడు.. ఎక్కడ?

దేశంలోనే బాగావెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన బీహార్ రాష్ట్రంలో నిరక్ష్యరాస్యులే కాదు.. కొందరు విద్యావంతులు చేసే పనులు కూడా విచిత్రంగానే ఉంటాయి. పంటి నొప్పితో ఓ వైద్యుడి వద్దకు వెళ్లిన బాధితురాలు

దేశంలోనే బాగావెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన బీహార్ రాష్ట్రంలో నిరక్ష్యరాస్యులే కాదు.. కొందరు విద్యావంతులు చేసే పనులు కూడా విచిత్రంగానే ఉంటాయి. పంటి నొప్పితో ఓ వైద్యుడి వద్దకు వెళ్లిన బాధితురాలు (రోగి) చివరకు తనువు చాలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆ వైద్యుడు చేసిన వైద్యం గురించి తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బీహార్‌లోని పాట్నా జిల్లా పులావరీ‌షరీఫ్‌లోని బైరియా ప్రాంతానికి చెందిన ఒక నకిలీ వైద్యుడి వద్దకు ధర్భంగా నివాసి ప్రమోద్‌రాయ్ భార్య సంగీత తీవ్రమైన పంటినొప్పితో బాధపడుతూ చికిత్స కోసం బైరియాలోని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌కు వచ్చింది. ఒక పన్ను తీయించుకోవాలని డాక్టర్ చెప్పడంతో ఆమె సమ్మతించింది. 
 
అయితే తర్వాత ఆ వైద్యుడు నాలుగు దంతాలు తీయించుకోవాలని చెప్పి, ఉలి, సుత్తి సాయంతో వాటిని బలంగా తొలగించసాగాడు. దీంతో ఆ నొప్పిని భరించలేక ప్రాణాలు కోల్పోయింది. దీనిని గమనించిన ఆ వైద్యుడు అక్కడి నుంచి పరారయ్యాడు. 
 
విషయం తెలసుకున్న మృతురాలి బంధువులు నర్సింగ్ హోంపై దాడికి దిగి, నానా హంగామా సృష్టించారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కాగా పోలీసులు నకిలీ వైద్యునిపై కేసు నమోదు చేసి, అతనికోసం గాలింపు చర్యలు చేపట్టారు.