సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: శనివారం, 9 జూన్ 2018 (16:04 IST)

జూన్ 10 నుంచి 16 జూన్ 2018 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)

వృషభంలో రవి, బుధుడు, కర్కాటకంలో శుక్ర రాహువులు, తులలో వక్రి బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో కుజ, కేతువులు. మేష, వృషభ, మిధున, కర్కాటకంలో చంద్రుడు. 10న బుధుడు, 15న రవి మిధున ప్రవేశం. 12న మాస శివరాత్రి, 15న బుద్ధ జయంతి. ముఖ్యమైన పనులకు తదియ, శనివార

వృషభంలో రవి, బుధుడు, కర్కాటకంలో శుక్ర రాహువులు, తులలో వక్రి బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో కుజ, కేతువులు. మేష, వృషభ, మిధున, కర్కాటకంలో చంద్రుడు. 10న బుధుడు, 15న రవి మిధున ప్రవేశం. 12న మాస శివరాత్రి, 15న బుద్ధ జయంతి. ముఖ్యమైన పనులకు తదియ, శనివారం అనుకూలదాయకం.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. పరిచయస్తులతో సంప్రదింపులు జరుపుతారు. సంతానం చదువులపై దృష్టి సారిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. ఖర్చులు విపరీతం. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. అతికష్టంమ్మీద ధనం సర్దుబాటవుతుంది. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. కాంట్రాక్టులు, ఏజెన్సీలు ఏమంత సంతృప్తినీయవు. ఉపాధ్యాయులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ప్రయాణం కలిసివస్తుంది.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆది, సోమ వారాల్లో పనులు సాగవు. ఖర్చులు విపరీతం. పరిచయస్తులు సాయం అందిస్తారు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. విమర్శలు, అభియోగాలు ఎదుర్కుంటారు. ఎవరినీ నిందించవద్దు. వ్యతిరేకించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, ఒత్తిడి, పనిభారం. సహోద్యోగులతో జాగ్రత్త. ధనప్రలోభాలకు లొంగవద్దు. కిట్టని వారు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. వృత్తుల వారికి సామాన్యం.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
దుబారా ఖర్చులు విపరీతం. ధనమూలక సమస్యలెదురవుతాయి. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. అవకాశాలను తక్షణం వినియోగించుకోవాలి. సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. మంగళ, బుధ వారాల్లో దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వస్త్ర, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారాలు లాభిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శుభకార్య యత్నం ఫలిస్తుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. ధనలాభం ఉంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడుతారు. ఆకస్మికంగా అవకాశాలు కలిసివస్తాయి. గృహం సందడిగా ఉంటుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు విపరీతం. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. గురు, శుక్ర వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. అప్రమత్తంగా వ్యవహరించాలి. అనవసర జోక్యం తగదు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఒంటెత్తు పోకడ తగడు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్ద ఖర్చు తగిలే ఆస్తారం ఉంది. పొదుపు మూలక ధనం ముందుగానే తీసుకుంటారు. గృహమార్పులు యత్నాలు సాగిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. శనివారం నాడు నిమర్శలు ఎదుర్కుంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆశాజనకం. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది వుండదు. పరిచయస్తులకు సాయం అందిస్తారు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ వహిస్తారు. విద్యా ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. ఆది, సోమవారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధి పథకాల్లో రాణిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
వేడుకలు, శుభకార్యాలకు హాజరవుతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. మంగళ, బుధవారాల్లో ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. విమర్శలు, అభియోగాలు ఎదుర్కొంటారు. సన్నిహితుల సాయం అందుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానం విదేశీ చదువులపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగయత్నం నిరుత్సాహపరుస్తుంది. యత్నాలను విరమించుకోవద్దు. వ్యాపారులు పుంజుకుంటాయి. నష్టాలను అధిగమిస్తారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ఠ 
గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. రాబడిపై దృష్టి పెడతారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ మాటే నెగ్గాలనే పంతం తగదు. కుటుంబీకుల సలహా పాటించండి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆది, గురువారాల్లో శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభం. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణకు సమయం కాదు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఊహించని సంఘటనలెదురవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు బాధ్యతల మార్పు, స్థానచలనం.
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం 
సంప్రదింపులకు అనుకూలం. అప్రమత్తంగా వ్యవహరించండి. దంపతుల మధ్య దాపరికం తగదు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వస్తునాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించండి. మంగళ, శుక్రవారాల్లో తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. ఆకస్మికంగా కొన్ని పనులు పూర్తవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. ఉపాధ్యాయులకు సమయపాలన ప్రధానం. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. కాంట్రాక్టులు ఏమంత లాభదాయకం కాదు. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ట్రాన్స్‌‍పోర్ట్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2పాదాలు 
ధనలాభం, వస్త్రప్రాప్తి పొందుతారు. గృహమార్పు కలిసివస్తుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పరిస్థితుల అనుకూలత ఉంది. పనుల ప్రారంభంలో చికాకులెదురవుతాయి. ఒకరికి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులవుతాయి. గురు, శుక్రవారాల్లో కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. శుభకార్యంలో పాల్గొంటారు. అయిన వారి ఆదరణ సంతృప్తినిస్తుంది. పూర్వ విద్యార్థులను కలుసుకుటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల తీరు బాధిస్తుంది. సహోద్యోగులతో జాగ్రత్త. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. వాణిజ్య ఒప్పందాలకు అనుకూలం. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పెద్దల సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. ఆర్థికలావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. రావలసిన ధనం అందక ఇబ్బందులెదుర్కుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆత్మీయుల సాయం అందుతుంది. పనులు వేగవంతమవుతాయి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. శనివారం నాడు అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగుకుండా మెలగాలి. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి, పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. అవసరాలకు ధనం సర్దుబాటు అవుతుంది. పనుల సకాలంలో పూర్తి కాగలవు. వేడుకను ఘనంగా పూర్తి చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. సన్నిహితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరం. గృహంలో మార్పులుచేర్పులకు అనుకూలం. గుట్టుగా యత్నాలు సాగించండి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు నిదానంగా సత్ఫలితాలిస్తాయి. వాహన చోదకులకు దూకుడు తగదు. పూర్వవిద్యార్థులను కలుసుకుంటారు. వీడియో చూడండి.