శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: శనివారం, 7 ఏప్రియల్ 2018 (22:06 IST)

ఏప్రిల్ 8 నుంచి 14 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)

మేషంలో శుక్రుడు, కర్కాటకంలో రాహువు, తులలో వక్రి బృహస్పతి, ధనస్సులో శని, కుజులు, మకరంలో కేతువు. మీనంలో రవి, వక్రి బుధులు. ధనస్సు, మకర, కుంభ, మీనంలలో చంద్రుడు. 14న శని త్రయోదశి. వృషభ, కన్య, వృశ్చిక, ధనుర్, మకర రాశుల వారు శనికి తైలాభిషేకం చేయించినట్లైతే

మేషంలో శుక్రుడు, కర్కాటకంలో రాహువు, తులలో వక్రి బృహస్పతి, ధనస్సులో శని, కుజులు, మకరంలో కేతువు. మీనంలో రవి, వక్రి బుధులు. ధనస్సు, మకర, కుంభ, మీనంలలో చంద్రుడు. 14న శని త్రయోదశి. వృషభ, కన్య, వృశ్చిక, ధనుర్, మకర రాశుల వారు శనికి తైలాభిషేకం చేయించినట్లైతే శుభం చేకూరుతుంది.
 
మేషం : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. రోజువారీ ఖర్చులే వుంటాయి. పొదుపు, పెట్టుబడుల దిశగా ఆలోచిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. కొత్త ప్రణాళికలు రూపొందించుకుంటారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. శనివారం నాడు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుకూలం. శుభకార్యాలకు హాజరవుతారు. బంధుత్వాలు బలపడతాయి. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు ధనప్రలోభం తగదు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ వహిస్తారు. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. ఆరోగ్యం సంతృప్తికరం. కీలక పత్రాలు అందుకుంటారు. ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. ఆది, సోమవారాల్లో ధనమూలక సమస్యలెదురవుతాయి. సహాయం అడిగేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. దంపతుల మధ్య అకారణ కలహం, చికాకులు తలెత్తుతాయి. ఓర్పుతో వ్యవహరించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. విందులు, వినోదాల్లో మితంగా ఉండాలి. ప్రయాణానికి సన్నాహాలు సాగిస్తారు. కళాకారులకు ప్రోత్సాహకరం.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గృహమార్పు కలిసివస్తుంది. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. శుభకార్యాలకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు సామాన్యం. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. మంగళ, బుధవారాల్లో ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనలాభం. ప్రశంసలు అందుకుంటారు. సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్ని రంగాల వారికి శుభదాయకమే. కష్టానికి ప్రతిఫలం అందుతుంది. ఖర్చులు సామాన్యం. పనులు చురుకుగా సాగుతాయి. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. ఆది, గురువారాల్లో వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అనవసర జోక్యం తగదు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఆహ్వానం అందుకుంటారు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. రుణ బాధలు తొలగుతాయి. పెట్టబడుల దిశగా ఆలోచిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. వేడుకలు, వినోదాల్లో అతిగా వ్యవహరించవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గృహం ప్రశాంతంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మంగళ, శనివారాల్లో పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు ప్రయత్నిస్తారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. వేడుకల్లో ప్రముఖంగా పాల్గొంటారు. మీ రాక బంధుమిత్రులకు సంతోషాన్నిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, నగదు ప్రాప్తి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. గురు, శుక్రవారాల్లో ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. సాంకేతిక, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆస్తి, స్థల వివాదాలు కొలిక్కివస్తాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. ప్రయాణంలో అవస్థలు తప్పవు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాక 1, 2, 3 పాదాలు
శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పెట్టుబడులు, పొదుపు పథకాలకు అనుకూలం. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు విపరీతం. వేడుకలను ఘనంగా చేస్తారు. అయిన వారి రాక సంతోషాన్నిస్తుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. శనివారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా గుర్తుంచుకోవాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. గృహ నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. విద్యార్థులు చక్కని ఫలితాలు సాధిస్తారు. వాహన చోదకులకు అవస్తలు తప్పవు. ప్రయాణం తలపెడతారు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఈ వారం ఖర్చులు అధికం. ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు నిదానంగా పూర్తవుతాయి. గృహమార్పు కలిసివస్తుంది. సంప్రదింపులకు అనుకూలం. వ్యవహారానుకూలత వుంది. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. మొహమ్మాటాలకు భేషజాలకు పోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆందోళన తొలగి కుదుటపడతారు. ఆశయం నెరవేరుతుంది. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. విందులు వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి.
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
శుభకార్యంలో పాల్గొంటారు. బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. అవసరాలకు ధనం అందక ఇబ్బందులెదుర్కుంటారు. రుణ ఒత్తిళ్లు అధికం. నోటీసులు, కీలక పత్రాలు అందుకుంటారు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పనులు మందకొడిగా సాగుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. నష్టాలు తొలగి లాభాలు గడిస్తారు. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగాలి. వృత్తి ఉపాధి పథకాల్లో అనుభవం గడిస్తారు. వాహన చోదకులకు దూకుడు తగదు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
వ్యవహారాలను సమర్థవంతంగా నడిపిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. గృహం సందడిగా ఉంటుంది. కుటుంబీకులతో ఉత్సాహంగా గడుపుతారు. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. నగలు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఆది, సోమవారాల్లో ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. సంతానం ద్వారా శుభవార్త వింటారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. కుటుంబ విషయాలు వెల్లడించవద్దు. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. వృత్తులవారికి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. సరుకు నిల్వలో జాగ్రత్త. సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. రుణ విముక్తులవుతారు. ఫైనాన్స్ సంస్థల్లో పనులు సానుకూలమవుతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. మంగళ, బుధవారాల్లో ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించండి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. కొత్త పరిచయాలేర్పడుతాయి. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. వివాదాల నుంచి బయటపడతారు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. యోగ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగితాయి. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పెద్దమొత్తం నగదుతో ప్రయాణం తగదు.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
మీదైన రంగంలో రాణిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. ఆదాయం సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది వుండదు. వేడుకలను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి ఎదుటివారికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. గురు, శుక్రవారాల్లో అనేక పనులతో సతమతమవుతారు. ప్రముఖుల సందర్శనం వీలుకాదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆస్తి, స్థల వివాదాలు జటిలమవుతాయి. పెద్దల సలహా పాటించండి. ఒంటెత్తు పోకడ తగదు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. గత అనుభవాలు జ్ఞప్తికొస్తాయి. 
 
వీడియో చూడండి...