కర్కాటకంలో రాహువు, తులలో బృహస్పతి, వృశ్చికంలో కుజుడు, ధనస్సులో శని, మకరంలో కేతువు, కుంభంలో రవి, బుధ, శుక్రులు. మీన, మేష, వృషభ, మిథునంలలో చంద్రుడు. 19న శుక్ర మౌడ్యమి త్యాగం. ముఖ్యమైన పనులకు నవమి, శనివారం అనుకూలదాయకం.
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ప్రేమానురాగాలు బలపడతాయి. సంతానం చదువుల పట్ల శ్రద్ధ అవసరం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రసీదులు, పత్రాలు జాగ్రత్త. ఆది, సోమవారాల్లో అపరిచితులను నమ్మవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. రుణ ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు సామాన్యం. నిలిచిపోయిన పనులు పూర్తి కాగలవు. సంప్రదింపులకు అనుకూలం. పంతాలు, భేషజాలకు పోవద్దు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. గృహం ప్రశాంతత ఉంటుంది. ఇతరుల బాధ్యతు పెట్టి ఇబ్బందులు ఎదుర్కుంటారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు పూర్తి కావస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. కంప్యూటర్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
చాకచక్యంగా వ్యవహరించాలి. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. సమర్థతకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది. యత్నాలను విరమించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. అవివాహితులకు నిరుత్సాహం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పరిచయాలు, వ్యాపకాలు బలపడతాయి. మంగళ, బుధవారాల్లో ఆందోళన కలిగించే సంఘటనలెదురవుతాయి. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. మంగళ, బుధవారాల్లో ఆందోళన కలిగించే సంఘటనలెదురవుతాయి. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉద్యోగస్తులకు పనియందు ధ్యాస ప్రధానం. అధికారులకు హోదా మార్పు, అదనపు బాధ్యతలు, వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా బాగుంటుంది. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనలాభం, కుటుంబ సౌఖ్యం ఉన్నాయి. పనుల్లో అవాంతరాలెదుర్కుంటారు. గురు, శుక్ర వారాల్లో అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. పెట్టుబడులకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. రిప్రజెంటేటివ్‌లకు శ్రమ అధికం. వేడుకలు, వినోదాల్లో పాల్గొంటారు.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఉపకారానికి ప్రత్యుపకారం పొందుతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహయత్నాలకు శ్రీకారం చుడతారు. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. శనివారం నాడు ఆలోచనలు నిలకడగా వుండవు. ఆత్మీయుల సాయం అందుతుంది. పనుల సానుకూలతకు ఓర్పు అవసరం. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఆరోగ్యంగా స్థిరంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికం. సహోద్యోగులు సహకరిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆహ్వానం, నోటీసులు అందుకుంటారు. వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. సేవా, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శుభకార్యం నిశ్చయమవుతుంది. పనులు సకాలంలో పూర్తి కాగలవు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత అనుభవాలు గుర్తుకొస్తాయి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు వెసులుబాటు ఉంటుంది. సమస్యలు పరిష్కరించుకుంటారు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఆది, సోమవారాల్లో మీ ఆలోచనలను నీరుగార్చేందుకు వ్యతిరేకులు యత్నిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. గృహమార్పు అనివార్యం. సంప్రదింపులు , ఒప్పందాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆహ్వానం అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వృత్తుల వారికి ఆశాజనకం. వాహన చోదకులకు అత్యుత్సాహం తగదు. క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2, 3 పాదాలు
కొత్త పరిచయాలేర్పడతాయి. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. అవతలి వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. కొన్ని సమస్యలు తొలగి కుదుటపడతారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మంగళ, బుధవారారాల్లో పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకరం. టెండర్లు, ఏజెన్సీలు లాభిస్తాయి. ఆప్తుల క్షేమం తెలుసుకుంటారు. పందాలు, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి.
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. బాధ్యతలు అప్పగించవద్దు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ రాక బంధువులకు ఆనందం కలిగిస్తుంది. విలువైన కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ధనలాభం ఉంది. ఆది, గురువారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. కంప్యూటర్, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
ఖర్చులు అంచనాలను మించుతాయి. అదనపు రాబడిపై దృష్టి సారిస్తారు. బంధువులతో సౌమ్యంగా మెలగండి. ఎవరినీ నిందించవద్దు. మంగళ, బుధవారాల్లో పనులు మొండిగా పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వివాహయత్నం ఫలిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చురుకుగా సాగుతాయి. పెట్టుబడుల విషయంలో నిర్ణయానికి వస్తారు. సంతానం చదువులపై శ్రద్ధ అవసరం. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. అధికారులకు ఆకస్మిక బదిలీ, హోదా మార్పు. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. హోల్‌సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
వివాహయత్నాలు ముమ్మరం చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. విలాస వస్తువులు అమర్చుకుంటారు. పోగొట్టుకున్న పత్రాలు లభిస్తాయి. సోదరీ సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. గురు, శుక్రవారాల్లో మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఖర్చులు పెరిగినా వెసులుబాటు ఉంటుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. అధికారులకు ధనప్రలోభం తగదు. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. భాగస్వామ్య చర్చలు ఫలిస్తాయి.
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆహ్వానం అందుకుంటారు. వ్యవహారాలు, లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఒక వ్యవహారంలో ధనం అందుతుంది. రుణ విముక్తులవుతారు. పనులు సానుకూలమవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. శనివారం నాడు కుటుంబ విషయాలు వెల్లడించవద్దు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఓర్పుతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆత్మీయుల సలహా పాటించండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. గృహమార్పు అనివార్యం. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. బాధ్యతలు, వ్యాపకాలు పెంపొందుతాయి. అప్రమత్తంగా వ్యవహరించాలి. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. అవివాహితులు కొత్త అనుభూతి చెందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలిస్తాయి. ఏజెన్సీలు, టెండర్లు దక్కించుకుంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. విందులు, వేడుకల్లో మితంగా ఉండాలి. వాహన చోదకులకు అత్యుత్సాహం తగదు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి
ఈ వారంలో ధనలాభం ఉంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలకు యత్నాలు సాగిస్తారు. వ్యవహారాల్లో మీదే పైచేయి. వాగ్ధాటితో ఆకట్టుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఫోన్ సందేశాలు, అపరిచితులను విశ్వసించవద్దు. పెద్దల సలహా పాటించండి. గృహమార్పు కలిసివస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. కొనుగోలుదార్లు, పనివారలతో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వైద్య, న్యాయ, అకౌంట్స్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి.