1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Not from books, learnt about poverty selling tea at railway platform: PM Modi

పేదరికం గురించి పుస్తకాల్లో చదవలేదు.. స్వయంగా అనుభవించా : నరేంద్ర మోడీ

Narendra Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సౌదీ అరేబియా దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా, పేదిరికంపై మాట్లాడుతూ, తాను పేదరికం గురించి పుస్తకాల్లో చదవలేదనీ, స్వయంగా అనుభవించినట్టు చెప్పారు. 
 
రెండు రోజుల సౌదీ అరేబియా పర్యటన కోసం మోడీ ఈ నెల 28వ తేదీన వెళ్లిన విషయం తెల్సిందే. ఈ పర్యటనను ముగించుకుని బుధవారం సాయంత్రానికి ఢిల్లీకి చేరుకోనున్నారు. అయితే, రియాద్‌లో జరిగిన ఓ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. 
 
'తాను పేదరికం గురించి పుస్తకాల్లో చదవలేదని, దాన్ని స్వయంగా అనుభవించానని మోడీ చెప్పారు. ఒకప్పుడు తాను రైల్వే ప్లాట్ ఫాంపై టీ అమ్ముకున్నానని, ఇప్పుడు ఇక్కడిదాకా వచ్చానని గుర్తుచేశారు. 
 
తాను గౌరవంగా బతికానని, తనకు పేదలంటే గౌరవమని తెలిపారు. వారికి సాధికారత లభించినప్పుడే దేశంలో పేదరికం అంతమవుతుందన్నారు. భారత్‌లో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించడంతో పాటు ప్రతి ఒక్కరితో బ్యాంకు ఖాతాలు తెరిపించడం ద్వారా వారికి సాధికారత కల్పిస్తున్నామని, వీటిద్వారా వారికి గౌరవం లభిస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
డాబాపై నిద్రిస్తుంటే నగ్నంగా ఫోటోలు తీయించి.. బెదిరించిన పినతల్లి