గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2019 (13:15 IST)

డాబాపై నిద్రిస్తుంటే నగ్నంగా ఫోటోలు తీయించి.. బెదిరించిన పినతల్లి

మహిళలపై నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. పట్టపగలు ఒంటరిగా రోడ్డుపై నడవాలన్నా మహిళలు వణికిపోతున్నారు. ఒకవైపు కామాంధులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటే..  మరోవైపు కొంతమంది మహిళలు కూడా దారుణమైన అక్రమాలకు ఒడిగడుతున్నారు.

అక్రమ సంబంధాల కోసం కుటుంబ సభ్యులను హతమార్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇటీవలే తెలంగాణలో కేవలం తన ఇద్దరు ప్రియులతో సెక్స్ కోరికలు తీర్చుకోవడం కోసం ఏకంగా కన్నతల్లినే కడతేర్చింది ఓ కసాయి కూతురు. 
 
ఈ నేపథ్యంతో తాజాగా చుట్టం చూపున పోయిన ఓ మహిళకు మత్తు మందు ఇచ్చి నగ్నంగా ఫోటోలు తీసి తన పినతల్లే బెదిరిస్తున్నట్లుగా ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే... నరసరావుపేటకు చెందిన మహిళ మండల పరిధిలోని బుక్కాపురంలో ఉంటున్న పినతల్లి వద్దకు చుట్టం చూపుగా వస్తుండేది.
 
ఈ క్రమంలో నెల రోజుల క్రితం ఆమెకు మత్తు మందు ఇచ్చి డాబాపై నిద్రిస్తున్న సమయంలో పక్కన వేరొక వ్యక్తితో కలిసి ఉన్నట్లు ఫొటోలు తీయించింది. ఆ తర్వాత బాధిత మహిళలకు ఆ ఫోటోలు తీసి అడిగినంత డబ్బు ఇవ్వకుండా నలుగురిలో పరువు తీస్తానని బెదిరించింది. ఆమె బెదిరింపులకు విసిగిపోయిన సదరు మహిళ తనకు రక్షణ కల్పించాలని సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.