శబరిమలలో మహిళపై కారం స్ప్రే చల్లిన ఆందోళనకారులు
శబరిమలలో బిందు అనే మహిళపై కారం స్ప్రే కొట్టారు ఆందోళనకారులు. ఆమె కళ్లలోకి కారం, పెప్పర్ చల్లి దాడికి పాల్పడ్డారు. ఎర్నాకుళం సిటీ పోలీస్ కమీషనర్ ఆఫీసు ఎదుట మంగళవారం ఈ ఘటన జరిగింది.
వాస్తవానికి ఈ మహిళ గత జనవరిలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఆ కోపంతోనే ఆమెపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలు ప్రవేశించరు.
కానీ సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో అయ్యప్ప స్వామి ఆలయంలోని స్వామిని మహిళలు దర్శించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బిందు అనే మహిళ అయ్యప్ప స్వామిని దర్శించుకుందనే కోపంతో ఆందోళనకారులు ఆమెపై మంగళవారం ఉదయం మిరియాలు, మిరపపొడి కలిపిన స్ప్రేని కొట్టారు.
అయితే ఆమెపై స్ప్రే చల్లలేదని.. మిరపపొడి చల్లితే అంత సాఫీగా మీడియాకు ఆమె ఇంటర్వ్యూ ఇవ్వదని ఆ ప్రాంత వాసులు ఆరోపించారు. అయితే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు తర్వాతే తాను స్వామిని దర్శించుకున్నానని తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.