సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 నవంబరు 2019 (12:19 IST)

మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. ఆ ఫోటోలతో బెదిరింపులు

విశాఖలో మహిళపై అత్యాచారానికి పాల్పడిన కీచకుడు ఆమెను నగ్నంగా ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. వాటి ద్వారా బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతూ ఆ తర్వాత కూడా ఆమెపై పలుసార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా తనకు డబ్బులు ఇవ్వాలంటూ వేధింపులకు దిగాడు. పలుసార్లు డబ్బులు ఇచ్చినా అతడి వేధింపులు మాత్రం ఆగలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
వివరాల్లోకి వెళితే.. విశాఖకు చెందిన ఓ మహిళ ప్రభుత్వ ఉద్యోగం చేస్తోంది. దీంతో ఆమెను ట్రాప్ చేసిన ఓ వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. ప్లాన్ ప్రకారం ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతర్వాత ఆమెను నగ్నంగా ఉన్న ఫోటోలను తీశాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. 
 
ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి ఆమెపై మరోసారి అత్యాచారం చేశాడు. డబ్బు కావాలంటూ బెదిరించాడు. పరువు పోతుందని భావించిన బాధితురాలు... అప్పులు చేసి మరీ అతగాడికి రూ.50 లక్షల వరకు డబ్బు అంటగట్టింది. ఈ దారుణానికి అతడి తల్లిదండ్రులు కూడా వంతపాడారు. చివరికి అతడి ఆగడాలను ఆపలేకపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.