శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 23 నవంబరు 2019 (21:10 IST)

మత్తు మందు ఇచ్చి లొంగదీసుకుని ఆపై ఫోటోలు తీసి బ్లాక్‌మెయిలింగ్

విశాఖలో మరో దారుణం వెలుగు చూసింది. ప్రభుత్వ ఉద్యోగినితో పరిచయం పెంచుకుని ఓ మృగాడు సాగించిన వికృతాలు వెలుగుచూశాయి. మత్తు మందు ఇచ్చి లైంగికంగా వేధించడమే కాకుండా... ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. 
 
బ్లాక్ మెయిలింగ్ భరించలేక లక్షల రూపాయలు బాధితురాలు అతడికి సమర్పించుకుంది. ఆ కామాంధుడి దుశ్చర్యకు అతడి తల్లిదండ్రులు కూడా అండగా నిలబడటం కలకలం రేపింది. బాధితురాలు స్పందనలో సిటీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది.