శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 8 జులై 2019 (13:29 IST)

గొల్లపూడిలో గంజాయి కలకలం..విజయవాడను వణికిస్తున్న డ్రగ్స్ మాఫియా

విజయవాడను డ్రగ్స్ మాఫియా వణికిస్తోంది. రాజధాని ప్రాంతం కావడంతో ఇప్పుడిప్పుడే పాగా వేస్తున్న మాఫియా పోలీసులతో పాటు తల్లిదండ్రులనూ దడపుట్టిస్తోంది. తాజాగా గొల్లపూడిలో భారీగా పట్టుబడ్డ గంజాయి ఈ భయాన్ని మరింత పెంచింది. భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గొల్లపూడి వన్ సెంటర్ దగ్గర సాయిపురం కాలనీలో ఆదివారం రాత్రి ఆకస్మికంగా పోలీసులు తనిఖీ చేశారు.
 
గొల్లపూడి సాయిపురం కాలనీలో  గంజాయి అమ్ముతున్నారని పక్కా సమాచారం అందుకున్న సీఐ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సై స్వామి తన సిబ్బందితో తనిఖీ చేస్తున్న సమయంలో గంజాయితో ముగ్గురు యువకులు పట్టుబడ్డారు.
 
వారిని స్టేషన్కు తరలించి విచారిoచగా ఆరు కేజీల గంజాయి దొరికింది. వీరు ఏకలవ్య నగర్‌కు చెందిన హనుక్, భవానిఫురం కు చెందిన దినేష్ రెడ్డి. ముజమిల్‌గా గుర్తించారు. ముగ్గురూ గొల్లపూడిలోని కొన్ని ప్రముఖ కాలేజీ స్టూడెంట్స్‌కి గంజాయి సప్లై చేస్తున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు.