సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 13 అక్టోబరు 2019 (18:13 IST)

అందమైన మహిళా ఐఏఎస్ అధికారి.. పెళ్లైనా పర్లేదు.. భర్తను అలా ఇరికించి?

అసలే మహిళా ఐఏఎస్ అధికారి. ఇంకా అందం కూడా తోడైంది. పెళ్లి కూడా జరిగిపోయింది. అయితే ఆ అందమైన మహిళా ఐఏఎస్ అధికారి మీద సీఐఎస్ఎఫ్ కమాండెంట్ రంజన్ ప్రతాప్ సింగ్ మనసుపడ్డాడు. పెళ్లైందని తెలిసినా.. ఆమెకు పొందాలనుకున్నాడు. క్రిమినల్‌గా ఆలోచించాడు. ఆమె భర్తను డ్రగ్స్ కేసులో ఇరికించాడు. 
 
ఆ కేసు నుంచి ఆమె భర్తను తప్పించడానికి హెల్ప్ చేస్తున్నట్టు నటిస్తే.. ఆమె తనకు దగ్గర అవుతుందని భావించాడు. అయితే, ప్లాన్ రివర్స్ అయింది. పోలీసులు ఈ కేసును లోతుగా విచారించడంతో అసలు సంగతి బయటపడింది. పండ్ల వ్యాపారి ద్వారా ఈ డ్రగ్స్ ప్యాకెట్ అందమైన మహిళా ఐఏఎస్ అధికారి భర్తకు దొరికిందని తెలిసింది. 
 
ఆ పండ్ల వ్యాపారిని అదుపులోకి తీసుకోవడంతో సీఐఎస్ఎఫ్ కమాండెంట్ రంజన్ ప్రతాప్ సింగే ఇందుకు కారణమని తెలిసింది. దీంతో రంజన్ ప్రతాప్ సింగ్ వద్ద పోలీసులు విచారణ జరిపారు. ఈ విచారణలో మహిళా అధికారిపై మనసు పడ్డానని చెప్పాడు. 
 
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ నుంచి తాను ఓ ఫ్రెండ్ ద్వారా డ్రగ్స్ తెప్పించానని పోలీసుల విచారణలో తెలిపాడు. భర్త ఈ కేసులో ఇరుక్కుంటే ఆమె తనకు దగ్గరవుతుందని భావించినట్లు వెల్లడించాడు.