ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 13 అక్టోబరు 2019 (15:52 IST)

కుందనపు బొమ్మలా శోభనం గదికి వెళ్తే.. భర్త స్థానంలో మరిది.. చివరికి?

కొత్తగా పెళ్లైంది. ఇక శోభనం కోసం ఆ వధువు కుందనపు బొమ్మలా తయారైంది. శోభనం కోసం గదిలోకి అడుగుపెట్టింది. కానీ శోభనం గదిలోకి వెళ్లిన కొత్త పెళ్లి కూతురికి షాక్ తప్పలేదు. తనతో ఉన్నది భర్త కాదని.. వేరే వ్యక్తి కాదని తెలిసి షాక్ అయ్యింది. కట్టుకున్న భర్తే వేరే వ్యక్తితో శోభనం సిద్ధం చేశాడని తెలిసి.. మోసపోయానని వాపోయింది. ఈ ఘటన బీహార్‌లోని పాట్నాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. భర్త కోసం శోభనపు గదిలోకి వెళ్లిన కొత్త పెళ్లి కూతురుని వెనక నుంచి వేరొక వ్యక్తి హత్తుకున్నాడు. అతడు తన భర్తేనని భావించిన ఆ యువతికి కిటికీలోంచి వచ్చిన వెలుతురు నిజాన్ని తెలియజేసేలా చేసింది. ఆ వెలుతురులో తనతో శృంగారంలో మునిగిపోయిన వ్యక్తి భర్త కాదని తెలిసింది. దింతో ఒక్కసారిగా లేచి గదిలో లైట్ వేసే సరికి తన భర్త స్థానంలో ఉంది అతని సోదరుడు అని తెలుసుకొని దిగ్భ్రాంతికి గురైంది. 
 
తనకు మరిది వరుస అయిన భర్త సోదరుడు తన శోభనం గదిలో తనపై చేయి వేయడంతో తన భర్త సోదరున్ని నిలదీసింది. ఇదంతా మామూలే అని తన అన్నయ్యే గదిలోకి పంపించాడని మరిది చెప్పడంతో మోసపోయానని గ్రహించింది. వెంటనే ఫోన్ అందుకుని తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని మెసేజ్ పెట్టింది. దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.