ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2019 (12:27 IST)

టాయిలెట్ సెల్ఫీ తీసుకో... రూ.51 వేల నగదు అందుకో.. ఎంపీ సర్కారు బంపర్ ఆఫర్

అమ్మాయి కావాలంటే ఇంట్లో టాయిలెట్ ఉన్నట్టుగా వరుడు నిరూపించాల్సిందేనని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భోపాల్ అధికారులు స్పష్టం చేశారు. ఇందుకోసం ఇంట్లోని టాయిలెట్ వద్ద వరుడు నిలబడి ఓ సెల్ఫీ తీసి పంపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇలా చేస్తే రూ.51 వేలు ఆర్థిక సాయం కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేయనుంది. 
 
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఇందులోభాగంగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న షాదీ ముబారక్ తరహాలో అక్కడ కూడా ఓ స్కీమ్ తీసుకొచ్చింది. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనదనీ, పెళ్లి తర్వాత అమ్మాయి.. పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్లడం ఆనవాయితీ అని పేర్కొంది. 
 
అందువల్ల స్వచ్ఛ భారత్‌లో భాగంగా పెళ్లి చేసుకునే వరుడు.. తన ఇంట్లోని టాయిలెట్ వద్ద నిలబడి సెల్ఫీ పంపించాలని ఇప్పటి నుంచి ఈ ఆచారాన్ని అందరూ పాటించాలని భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. భోపాల్‌లోని అన్ని ప్రాంతాల్లో ఈ ఆచారం పాటించాలని చెప్పారు. పెళ్లికి ముందు వరుడి ఇంట్లో టాయిలెట్ ఉందని నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు.
 
ఇలా చేయడం వల్ల వధువు తల్లిదండ్రులు కూడా తమ బిడ్డను ఇచ్చేందుకు ముందుకు వస్తారనీ పేర్కొంది. అలాగే, ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇది స్వచ్ఛ భారత్‌లో భాగమన్నారు. ఎవరైతే పెళ్లికి ముందే తమ అత్తవారింట్లో టాయిలెట్ ఉందని నిరూపిస్తారో వారికి ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది డిసెంబర్ 18న అధికారంలోకి వచ్చిన రెండో రోజే.. ఈ పాలసీలో అప్పటి వరకు ఉన్న ఆర్టిక సహాయాన్ని రూ.28 వేల నుంచి రూ.51 వేలకు పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే.