బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 8 జూన్ 2019 (15:39 IST)

మంత్రాల హడావుడి... వరుడు మెడలో తాళికట్టబోయిన వధువు (వీడియో)

'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్'.. ఇది ఓ సినిమాలోని పాట. కానీ, కొన్ని విషయాల్లో మాత్రం ఇలా జరిగితే కొంపలే కూలిపోతాయ్. తాజాగా ఓ పురోహితుడు మంత్రాల హడావుడిలో పడి వరుడు మెడలో వధువుతో తాళి కట్టించబోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన ప్రతిఒక్కరూ పడిపడీ నవ్వుకుంటున్నారు. తీరా బంధువుమిత్రులు చూసి వారించడంతో వధువు వెనక్కి తగ్గింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ పెళ్లిమండపంలో పురోహితుడు పెళ్లి జరిపిస్తున్నాడు. ఈయన వేదమంత్రాలు చదువుతూ అయోమయంలో ఉన్నాడు. అపుడు వరుడు చేతికి ఇవ్వాల్సిన తాళి వధువు చేతికి ఇచ్చి తాళి కట్టాలంటూ పురమాయించాడు. అంతే.. పెళ్లికి వచ్చినవారంతా ఒక్కసారి అవాక్కయ్యారు. వెంటనే పురోహితుడు తేరుకుని ఆ పసుపుతాడును తీసుకుని వరుడు చేతికి ఇచ్చారు. దీంతో వధువు మెడలో వరుడు మూడు ముళ్లు వేయడంతో ఈ పెళ్లి కథ సుఖాంతమైంది. ఇదంతా చూస్తున్న బంధుమిత్రులు, అతిథులు పడీపడీ నవ్వుకున్నారు. అయితే, ఈ పెళ్లి ఎక్కడ జరిగిందో మాత్రం తెలియలేదు.