బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 26 మే 2019 (11:08 IST)

వధువు మెడలో వరుడుకు బదులు చెల్లి తాళికట్టే సంప్రదాయం.. ఎక్కడ?

హిందూ సంప్రదాయం ప్రకారం వధువు మెడలో వరుడు మూడు ముళ్లు వేస్తారు. కానీ, ఆ గ్రామంలో హిందూ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. కానీ, వధువు మెడలో వరుడు స్థానంలో పెళ్లి కుమారుడు చెల్లి తాళి కడుతుంది. ఈ వింత సంప్రదాయం దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని ఓ గిరిజన గ్రామంలో ఇప్పటికీ ఓ ఆచారంగా కొనసాగుతోంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్ రాష్ట్రంలోని పలు గిరిజన గ్రామల్లో పెళ్లి కుమార్తె మెడలో వరుడికి బదులు అతడి చెల్లి తాళికట్టడం అనేది ఓ సంప్రదాయంగా ఉంది. ఈ ఆచారం ప్రకారం... పెళ్లి ముహూర్తం సమయానికి వరడు కనిపించకుండా పోతాడు. దీంతో అతడి చెల్లి లేదా ఆ కుటుంబం నుంచి మరొక మహిళ వచ్చి వధువు మెడలో తాళి కడుతుంది. 
 
అయితే, ముహూర్త సమయానికి కనిపించకుండా పోయిన వరుడు మాత్రం తన తల్లితో కలిసి ఇంటివద్దే తన భార్య కోసం వేచి చూస్తుంటాడు. ఆ తర్వాత పెళ్ళిమండపం నుంచి తాళి కట్టిన చెల్లి తన అన్న భార్యను ఇంటి గుమ్మ వరకు తీసుకెళ్లి.. వదిలిపెడుతుంది. అంటే.. వరుడు చేయాల్సిన అన్ని కార్యక్రమాలు వరుడు చెల్లి పూర్తిచేస్తుంది. 
 
ఇలా చేసుకోకుంటే కీడు జరుగుతుందని మా నమ్మకం. ఈ ఆచారాన్ని అతిక్రమించిన వాళ్లు కొన్నాళ్లకు విడిపోవడమో లేదా కుటుంబ కలహాలు రావడమో జరుగుతుంది. కొన్నిసార్లు ఇతర సమస్యలు కూడా రావొచ్చు అని సుర్కేడా గ్రామ పెద్ద కాంజిభాయ్ రత్వా వెల్లడించారు.