శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2019 (14:23 IST)

అఖిలప్రియకు కట్టుకున్న భర్తతో కష్టాలు.. ఏమైందో తెలుసా? (Video)

మాజీ మంత్రి అఖిల ప్రియకు కష్టాలు మొదలయ్యాయి. వైకాపా నుంచి టీడీపీకి షిఫ్ట్ అయిన అఖిల ప్రియకు మంత్రి పదవి ఇచ్చినా.. అందులో ఆశించిన మేర నిలదొక్కుకోలేకపోయింది. తల్లిదండ్రులు కోల్పోయిన అఖిలప్రియ ఆపై రెండో వివాహం కూడా చేయించుకుంది. అయితే కట్టుకున్న భర్తతో అఖిల ప్రియకు ప్రస్తుతం కొత్త చిక్కొచ్చి పడింది. 
 
మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ కోసం ఆళ్లగడ్డ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గత రెండ్రోజులుగా పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకుని తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ఓ పోలీసుపై కారును పోనిచ్చాడన్న కేసులు కూడా భార్గవరామపై నమోదయ్యాయి. ప్రస్తుతం ఆళ్లగడ్డ పీఎస్‌లో రెండు కేసులు, గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఓ కేసు నమోదు అయ్యాయి.
 
రెండ్రోజుల కిందట హైదరాబాద్‌లో భార్గవరామను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే కారును ఆపినట్లే ఆపి.. ఆ తర్వాత వేగంగా కారును డ్రైవ్ చేసుకుని వెళ్లాడని ఆళ్లగడ్డ ఎస్‌ఐ చెప్తున్నారు. అంతేకాదు కారును తమపైకే పోనిచ్చాడని ఎస్‌ సోమేష్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌ అఖిలప్రియ భర్త కోసం గాలింపును ముమ్మరం చేసింది. 
 
ప్రస్తుతం అతనిపై ఐపీసీ సెక్షన్‌ 353, 336 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరి అఖిలప్రియ తన భర్తను ఈ కేసుల నుంచి ఎలా కాపాడుకుంటారనేది తెలియాలంటే వేచి చూడాలి మరి.