శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 23 నవంబరు 2019 (19:45 IST)

వంద కిలోమీటర్ల వేగంతో కారు.. ఫ్లై ఓవర్‌ నుంచి పల్టీలు కొడుతూ(Video)

హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని బయోడైవర్శిటీ ఫ్లైవర్‌పై నుంచి ఓ కారు కిందపడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగినపుడు కారు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్టు సమాచారం. 
 
శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదం వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ గచ్చిబౌలిలో బయోడైవర్శిటీ ఫ్లైఓవర్ ఉంది. ఈ వంతెనపై నుంచి కారు ఒక్కసారిగా కింద పడింది. అయితే ఫ్లై ఓవర్ కింద నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ కారు కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. 
 
కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా.. ఫ్లై ఓవర్ కింద ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై ఈ వారంలో ఇది రెండో ప్రమాదం కావడం గమనార్హం.