1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Police reached with in minutes when they received Disha call

అమ్మో! ఆక‌తాయిలంటూ దిశ ఫోన్ కాల్ తీరా వెళ్తే...?

Police
గుంటూరు జిల్లా తెనాలి పోలీసులను మ‌హిళ‌లు పరుగులు పెట్టించారు. ఊరి చివర ఆకతాయిలు వేధిస్తున్నారంటూ దిశ యాప్ ద్వారా డయల్ 100కు మ‌హిళ‌లు ఫోన్ చేశారు. ఫోన్ కాల్ అందుకుని ఆగమేఘాల మీద ఘటనా స్థలికి చేరుకున్న త్రీటౌన్ పోలీసుల‌కు అక్క‌డ చుక్క‌లు క‌నిపించాయి.

తీరా అది చివరికి... జిల్లా రూరల్ ఎస్పీ ఆదేశాలతో... స్పెషల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డెమో కాల్‌గా తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

మహిళల‌ నుండి ఫోన్ రాగానే, రెండు కిలోమీటర్ల దూరాన్ని ఐదు నిమిషాల వ్యవధిలో సిబ్బందితో సహా చేరుకున్న త్రీ టౌన్ సిఐ కె.రాఘవేంద్రను డిపార్ట్ మెంట్ అభినందించింది. దిశ కేసు అని కంగారుప‌డ్డా అని తెలియ‌జేయ‌డం సీ.ఐ. వంతు అయింది.
About Writer
జెఎస్కె
తర్వాతి కథనం
పది లక్షల మాస్కులను ప్రభుత్వానికి ఇచ్చిన కియా ఇండియా