గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 19 ఆగస్టు 2020 (17:19 IST)

ఓకే.. కూల్ థాంక్యూ: సుశాంత్‌తో దిశ, 5 రోజుల వ్యవధిలోనే ఇద్దరూ ఆత్మహత్య

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే సుశాంత్ కేసుకు సంబంధించి ఓ వాట్సాప్ చాటింగ్ తాజాగా నెట్లో రౌండ్లు కొడుతోంది. ఇది సుశాంత్‌కు అప్పటి మేనేజర్ దిశా శాలియన్ మధ్య సాగిన వాట్సాప్ చాటింగ్.
 
 ఏప్రిల్ 2వ తేదీన ఒకసారి ఆ తర్వాత అదే నెలలో 10వ తేదీ మధ్య వీరు పబ్‌జీ, ఓ ఫుడ్ ఆయిల్ బ్రాండ్ ప్రమోషన్ పైన చాటింగ్‌లో చర్చించుకున్నారు. ఆ తరువాత దిశ పబ్ జీ డిజిటల్ ప్రచారం కోసం ఏప్రిల్ 7న సుశాంత్‌ని కలిసిందని తెలుస్తోంది. అయితే ఇదంతా జరిగిన 2 నెలల తర్వాత ఏమైందో తెలియదు కానీ జస్ట్ 5 రోజుల వ్యవధిలోనే ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.