సంబంధిత వార్తలు
- Niharika Konidela: వంద దేవుళ్ళు ట్రైలర్ చూశాక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలా వుంది : నిహారిక కొణిదెల
- Ravi Teja: కూతురి కోసం తండ్రిగా ఇరుముడి వేసుకున్న రవితేజ ఏం చేశాడు
- జూన్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోన్న విజయ్ ఆంటోని వంద దేవుళ్ళు
- Vijay Antony,: ఫీల్ గుడ్ ఎమోషన్‌తో విజయ్ ఆంటోనీ నాన్న కుట్టి
- Veera Bhadrudu Review: సూర్య నటించిన వీర భద్రుడు సక్సెస్ అయ్యాడా? లేదా? వీరభద్రుడు రివ్యూ
Niharika Konidela: బిచ్చగాడు కంటే వంద దేవుళ్ళు విజయం సాధించాలి : నిహారిక కొణిదెల
Niharika Konidela, Vijay Antony, Swasika, Trinadha Rao Nakkina
విజయ్ ఆంటోని మాట్లాడుతూ .. శశి గారు 20 ఏళ్ల నన్ను మ్యూజిక్ దర్శకుడిగా పరిచయం చేశారు. పదేళ్ల క్రితం శశి గారు బిచ్చగాడు చిత్రంతో హీరోగా నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ వంద దేవుళ్ళు అంటూ మేం రాబోతోన్నాం. శశి గారు కథ చెప్పిన తరువాత నేను ఎంతో ఏడ్చేశాను. నాకు కన్నీళ్లు మాత్రం ఆగలేదు. నా పాత్ర చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుంది. బిచ్చగాడు నుంచి నాతో ప్రయాణిస్తున్న భాష్య శ్రీ గారికి థాంక్స్. శశి గారు ఈ మూవీతో కొత్త టెక్నికల్ టీంను పరిచయం చేశారు. వంద దేవుళ్ళు మూవీని సుబ్బారెడ్డి గారు, మైత్రి శశి గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నా నిర్మాత ఫాతిమా గారికి థాంక్స్. జూన్ 19న రాబోతోన్న మా వంద దేవుళ్ళు తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అని అన్నారు.
నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. వంద దేవుళ్ళు మూవీని ఆల్రెడీ నేను చూశాను. శశి గారు తీసిన శ్రీను మూవీ చూసి నేను వెక్కి వెక్కి ఏడ్చాను. ఆయన బిచ్చగాడు లాంటి గొప్ప సినిమాని తీశారు. ప్రతీ ఒక్కరూ హార్ట్ పెట్టి మూవీకి పని చేసినట్టుగా కనిపిస్తోంది. పెళ్లి అయితే, పిల్లల్ని కంటే అమ్మాయి అమ్మగా మారిపోతుంది. అయితే అమ్మలోనూ అమ్మాయి ఉంటుంది. అదే పాయింట్‌ను గొప్పగా చూపించారు. స్వాసిక గారు చాలా అద్భుతంగా నటించారు. అజయ్, కావ్య అందరూ చక్కగా నటించారు. వంద దేవుళ్ళు అనే టైటిలే నాకు చాలా బాగా నచ్చింది. టైటిల్‌తోనే అందరినీ ఆకట్టుకున్నారు. విజయ్ ఆంటోని గారు చేసే ప్రతీ సినిమాలో అద్భుతమైన కంటెంట్ ఉంటుంది. ఆయన దర్శకుడు, హీరో, నిర్మాత, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఎన్ని ఉన్నా.. అన్నింటికంటే కూడా ఆయన ఒక మంచి వ్యక్తి. ఆయన్ను కలిసి మాట్లాడాక మరింత గౌరవం పెరిగింది. ఈ చిత్రంలో ఫ్యాన్ నుంచి టీ కప్పు వరకు అన్నింటికీ ఓ ఇంపార్టెన్స్, ఓ కారెక్టర్ ఉంటుంది. ఎంత ఎమోషనల్‌గా ఉంటుందో.. అంతే వినోదాత్మకంగా ఉంటుంది. విజయ్ ఆంటోని గారి పాత్ర ఎంతో గొప్పగా ఉంటుంది. ఆలోచన రేకెత్తించేలా సినిమా ఉంటుంది. కమర్షియల్ అంశాలతోనే గొప్పగా చిత్రాన్ని మలిచారు. అమ్మను కలిగిన ప్రతీ ఒక్కరూ వంద దేవుళ్ళు సినిమాని చూడాలి. బిచ్చగాడు కంటే వంద దేవుళ్ళు విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ .. విజయ్ ఆంటోని గారి సినిమాలంటేనే యూనిక్ కంటెంట్ ఉంటుంది. ఆయన ఎలాంటి సబ్జెక్ట్ చేసి ఉంటారా? అని తెలుసుకునేందుకు అయినా సినిమాని చూస్తుంటాను. కంటెంట్‌ని మాత్రమే నమ్ముకుని ఆయన చిత్రాలు చేస్తుంటారు. వంద దేవుళ్ళు కోసం ఇక్కడకు ఇలా రావడం ఆనందంగా ఉంది. ఈ మూవీ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
నిర్మాత ఫాతిమా విజయ్ ఆంటోని మాట్లాడుతూ .. వంద దేవుళ్ళు ఈవెంట్‌కు వచ్చిన నిహారిక గారికి, త్రినాథరావు నక్కిన గారికి థాంక్స్. శశి గారు, విజయ్ ఆంటోని గారు కలిసి చేసిన వంద దేవుళ్ళు అందరినీ ఆకట్టుకుంటుంది. భాష్య శ్రీ గారు మా ఇంట్లోనే స్క్రిప్ట్ డబ్బింగ్ వర్షెన్ కంప్లీట్ చేస్తుంటారు. జూన్ 19న మా సినిమా రిలీజ్ కాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను అని అన్నారు.
దర్శకుడు శశి మాట్లాడుతూ .. బిచ్చగాడు మూవీతో పదేళ్ల క్రితం ఇక్కడకు వచ్చాను. అప్పుడు మా గురించి ప్రేక్షకులకు ఏమీ తెలియకపోయినా పెద్ద హిట్ చేశారు. ఆ మూమెంట్ నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. తెలుగు ప్రేక్షకుల్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఇప్పుడు మళ్లీ విజయ్ ఆంటోనితోనే వంద దేవుళ్ళు అని తల్లీకొడుకుల కథతో రాబోతోన్నాను. ఇది బిచ్చగాడుకి పూర్తి భిన్నంగా ఉంటుంది. అమ్మని దేవతలా చూస్తే అది బిచ్చగాడు.. అమ్మని సాధారణ మనిషిలా చూస్తే వంద దేవుళ్లు. బిచ్చగాడు ఎంతలా నచ్చిందో.. వంద దేవుళ్ళు కూడా అంతే స్థాయిలో నచ్చుతుంది అని అన్నారు.
నటి కావ్య అనిల్ మాట్లాడుతూ .. విజయ్ ఆంటోని గారితో పని చేయడం ఆనందంగా ఉంది. శశి గారి ముందు నేను ఒక స్టూడెంట్‌లా ఉండి అంతా నేర్చుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్ ఆంటోని సర్‌కు థాంక్స్. ఆయన్నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. మా సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ .. వంద దేవుళ్ళు సినిమా అద్బుతంగా వచ్చింది. మైత్రితో కలిసి ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాం. విజయ్ ఆంటోని గారికి మంచి విజయం దక్కబోతోంది. మాకు సపోర్ట్ చేస్తున్న నిహారిక గారికి, త్రినాథరావు నక్కిన గారికి థాంక్స్ అని అన్నారు.
రైటర్ భాష్య శ్రీ మాట్లాడుతూ .. బిచ్చగాడు నుంచి విజయ్ ఆంటోని గారితో జర్నీ కొనసాగుతోంది. శశి గారు ప్రతీ చిన్న విషయాన్ని ఎంతో పరిశీలిస్తుంటారు. వంద దేవుళ్లు కేవలం ఒక సినిమా కాదు.. ఇదొక గొప్ప ఆలోచన. ఈ ఆలోచనను మీడియానే ముందుకు తీసుకు వెళ్లాలి. అమ్మకి జరిగిన ఘటన చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. ఈ మూవీకి మాటలు, పాటలు రాశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన శశి గారు, విజయ్ గారికి థాంక్స్ అని అన్నారు.
మన్యం రమేష్ మాట్లాడుతూ .. వంద దేవుళ్ళు టీజర్, ట్రైలర్ బాగున్నాయి. శశి గారు మంచి కథతో రాబోతోన్నారు. విజువల్స్, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. విజయ్ ఆంటోని గారికి మళ్లీ ఓ పెద్ద సక్సెస్ రాబోతోంది అని అన్నారు.
నటీనటులు : విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, లిజోమోల్ జోస్, కావ్య, శక్తి, పదిని, కర్ణాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుల్ దాస్, బక్స్, వినోదిని, మునీష్‌కాంత్, కొడంగి వడివేలు తదితరులు
