సంబంధిత వార్తలు
- విశాఖ ప్లాంట్‌పై మాట్లాడే ధైర్యం దమ్మూ జగన్‌కు ఉందా?: చంద్రబాబు గర్జన
- నవగ్రహ దోషాలకు చెక్ పెట్టాలంటే...? చర్మంతో చేసిన మనిపర్సులను..?
- విజ్ఞులైన తిరుపతి ఓటర్లు ఒకసారి ఆలోచించాలి : వైకాపా ఎమ్మెల్యే
- ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఫైట్: రీ-పోలింగ్.. బ్యాలెట్ పత్రాలు తారుమారు కావడంతో..?
- తిరుపతిలో ఉప ఎన్నికలు.. ప్రచార బరిలోకి ఏపీ సీఎం జగన్..!?
తిరుమల శ్రీవారి గెటప్‌లో నిత్యానంద స్వామి.. ఫోటో వైరల్
Nithyananda
ఆస్ట్రేలియా దేశం నుంచి కైలాస దీవికి గరుడ పేరిట ఛార్టర్ విమాన సర్వీసులను నిత్యానంద ప్రారంభించినట్లు వార్తలు వెలువడ్డాయి. కైలాస దీవిలో ఎవరికైనా వసతి కల్పిస్తారని, అయితే కేవలం మూడు రోజులకు మించి ఉండటానికి అనుమతించరని సమాచారం.
దీవిని సందర్శించేవారు పరమశివుని సందర్శించడానికి అనుమతిస్తారు. కైలాస డాట్ ఆర్గ్ పేరిట అధికారిక వెబ్ సైట్ సైతం ప్రారంభించారని సమాచారం. ఆగస్టు నెలలో నిత్యానంద రిజర్వుబ్యాంకు ప్రారంభించిన వీడియోను విడుదల చేశారు. కైలాస దీవిలో ఇంగ్లీషు, సంస్కృతం, తమిళభాషలను అధికారిక భాషలుగా గుర్తించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీవారి గెటప్‌లో నిత్యానంద కనిపించాడు.
Nithyananda
నిత్యానంద అప్పుడప్పుడు తాను కృష్ణ పరమాత్ముని అవతారంగా చెప్పుకుంటాడు. ఇందులో భాగంగా ప్రస్తుతం తిరుమల శ్రీవారి గెటప్‌లో కనిపించి ఆ ఫోటోను నెట్టింట వైరల్ చేశాడు. ఇందుకు నిత్యానంద సమాధి దర్శనం అంటూ ట్యాగ్ చేశాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
