1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. The Grandma Who Fight with a Monkey: Watch What Monkey Did (Video)

కోతితో బామ్మ ఫైట్, ఏం జరిగిందో చూడండి, వీడియో

Grandma-monkey fight
అసలే కోతి. దాన్ని కదిలిస్తే ఇంకేమైనా వుంటుందా, ఏం చేస్తుందో దానికే తెలియదు. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఓ వీడియోలో ఓ బామ్మ కోతిని తరుముతోంది. ద్విచక్ర వాహనంపై కూర్చున్న కోతిని రాయిని ఎత్తి విసిరేసింది. ఆ దెబ్బను తప్పించుకున్న కోతి కాస్తా బామ్మ మీద పడి పళ్లతో కొరకపోయింది.
 
ఎలాగో విదిలించుకున్న బామ్మ మళ్లీ పట్టువదలకుండా ఈసారి ఓ కర్రతో కోతిని కొట్టపోయింది. అది కూడా రెట్టించిన ఆగ్రహంతో కర్రను పట్టుకుని మీదకు ఉరికింది. కోతి దెబ్బకు జడుసుకున్న బామ్మ ఇక అక్కడ్నుంచి వెనుదిరిగింది. కానీ కోతి మాత్రం ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తూనే వుంది. ఈ వీడియో కాస్త వైరల్ అవుతోంది.
About Writer
ఐవీఆర్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
చెన్నై అన్నాసాలైలో కొత్త ఫ్లాగ్‌షిప్ షోరూమ్‌ను ప్రారంభించిన వీబీజే