1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Viral Photo, Did MS Dhoni Really Spit Blood During The Match Against England?

ధోనీ రక్తం కక్కుకున్నాడా... ఫోటో వైరల్...

Viral Photo
జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచ కప్ పోటీలు ప్రారంభమైన దగ్గర్నుంచి వార్తల్లో నిలుస్తూనే వున్నాడు. అన్ని మ్యాచిల్లో బాగానే రాణిస్తున్నా... ఏమాత్రం జట్టు ఓడుతున్నా అంతా ధోనీ పైన పడుతున్నారు. ఇక తాజాగా ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ ప్రచారం కూడా ఊపందుకుంది. ఇదిలావుండగా ధోనికి సంబంధించి ఓ ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది.
 
అదేమిటంటే... ధోనీ ఇంగ్లాండుతో ఆడుతున్నప్పుడు రక్తం కక్కుకున్నాడంటూ ఓ ఫోటోను షేర్ చేస్తున్నారు. దాంతో ధోనీ ఫ్యాన్స్ బెంబేలెత్తిపోయారు. అసలు ధోనీ రక్తం ఎందుకు కక్కుకున్నాడు అనేదానిపై ఆరా తీస్తే ఆరోజున ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ కుడి చేతి బొటన వేలికి గాయమైంది. దాంతో సహజంగానే ఆ వేలిని నోట్లో పెట్టుకుని రక్తం కారకుండా చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వేలి ద్వారా నోట్లోకి వచ్చిన రక్తాన్ని ఉమ్మి వేశాడు. ఆ ఫోటోను తీసినవారు నెట్లో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.
తర్వాతి కథనం
6 ల‌క్ష‌లు దాటిన గ్రామ వాలంటీర్ ద‌ర‌ఖాస్తులు... 2 ల‌క్ష‌ల‌కు పైగా మ‌హిళా అభ్య‌ర్థులు