50 మ్యాచ్‌ల్లో నాటౌట్.. ధోనీ రికార్డు అదుర్స్.. కేవలం 2 మ్యాచ్‌ల్లోనే ఓటమి.. (video)
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2019లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డుల పంట పండించాడు. గత ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ మహేంద్ర సింగ్ ధోని అజేయంగా నిలిచాడు.
2019 ప్రపంచ కప్ 38వ మ్యాచ్‌లో ఎంఎస్ ధోని నాటౌట్ 42 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిపోయినా.. ధోనీ మాత్రం ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇప్పటివరకు ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఎంఎస్ ధోని జట్టులో వున్న ఏ మ్యాచ్‌లోనూ ఓటమిని చవిచూడలేదు. ఇంకా ధోనీ వన్డే కెరీర్‌లో కేవలం రెండుసార్లు మాత్రమే టీమిండియా గెలుపును నమోదు చేసుకోలేకపోయింది.
ప్రస్తుతం, ప్రపంచ రికార్డులో, ఎంఎస్ ధోని వన్డే క్రికెట్లో 50 సార్లు అజేయంగా నాటౌట్‌గా నిలిచిన ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. టీమిండియా ధోనీ వుండగా కేవలం రెండుసార్లు ఓడిపోగా, ధోని 47 మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచాడు.
అంతేగాకుండా 50 వన్డేల్లో అవుట్ కాని ఏకైక బ్యాట్స్‌మన్‌గా ధోనీ నిలిచాడు. వీటిల్లో అత్యధికంగా 2013లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ 54 పరుగులతో అర్థ శతకాన్ని సాధించి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే ప్రస్తుత వన్డే ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 పరుగులు సాధించిన ధోనీ నాటౌట్‌గా నిలిచాడు.
ఈ రెండు మ్యాచ్‌ల్లోనే భారత్ పరాజయం పాలవడం గమనార్హం. ఇప్పటివరకు 40కి పైగా నాటౌట్‌గా నిలిచిన ఆటగాళ్లు ఎవ్వరూ లేరు. కానీ ధోని అజేయ గణాంకాలు చాలా ప్రత్యేకమైనవి, అతని సారథ్యంలోనూ.. అతనకు ఆడే మ్యాచ్‌ల్లో భారత్ 95 శాతానికి పైగా మ్యాచ్‌లను గెలుచుకుంటుంది.
కానీ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ సరిగ్గా ఆడలేదని విమర్శలు వచ్చాయి. ఎంఎస్ ధోని ఇంగ్లండ్‌పై మంచి స్ట్రైకర్ రేటును కలిగివున్నాడు. అతని స్ట్రైకర్ 135 కంటే ఎక్కువ, హార్దిక్ పాండ్యా తరువాత రెండవ అత్యధిక స్ట్రైకర్‌గా వున్నాడు.