సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : ఆదివారం, 30 జూన్ 2019 (11:25 IST)

వరల్డ్ కప్ : ఫైనల్‌కు వెళ్లేది ఆ రెండు జట్లే .. వీవీఎస్ లక్ష్మణ్ జోస్యం

ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు సెమీస్‌కు చేరుకుంది. రెండో జట్టుగా భారత్ ఉంది. అయితే ఈ వరల్డ్ కప్ పోటీల్లో ఫైనల్‌కు వెళ్లే జట్లు భారత్, ఆస్ట్రేలియా మాత్రమేనని భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్. లక్ష్మణ్ జోస్యం చెప్పారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, ఈ ప్రపంచ కప్‌లో మిగిలిన జట్లతో పోల్చుకుంటే భారత్, ఆస్ట్రేలియా జట్లు అన్ని రంగాల్లో బలంగా ఉన్నాయన్నారు. బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ స‌మ‌తూకంతో ఉన్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. 2003 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్లో త‌ల‌ప‌డిన భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లే జులై 14న లార్డ్స్ వేదిక‌గా జ‌రుగ‌నున్న‌ ఈ ప్రపంచ‌క‌ప్ ఫైన‌ల్ బ‌రిలోనూ దిగుతాయ‌న్నాడు.
 
ఇక‌, మ‌హేంద్ర సింగ్ ధోనీ వంటి అనుభ‌వ‌జ్ఞుడైన‌, తెలివైన ఆట‌గాడు జ‌ట్టుతో పాటు క‌లిసి ఉండ‌డం కోహ్లీ సేనకు లాభిస్తుందన్నారు. మైదానంలో ఆట‌ను చ‌ద‌వ‌డంలో ధోనీని మించిన ఆట‌గాడు లేడ‌ని, ధోనీ కీప‌ర్‌గా ఉండ‌డం బౌల‌ర్ల‌కు కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నాడు. త‌న ఆలోచ‌న‌ల‌ను కుర్రాళ్ల‌తో పంచుకోవ‌డానికి ధోనీ ఎప్పుడూ వెన‌కాడ‌డ‌ని చెప్పాడు. అయితే మిడిల్ ఓవ‌ర్ల‌లో బ్యాటింగ్ భారాన్ని ధోనీ తీసుకోవాల‌ని, అత‌ణ్ని నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దింపాల‌ని సూచించాడు.