బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 29 జూన్ 2019 (15:49 IST)

స్టార్ హోటళ్ళలో ఫోటోలు తీసిన ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు?

క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్ - భారత జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ బర్మింగ్ హామ్ వేదికకానుంది. ఇందుకోసం ఇరు జట్లూ బర్మింగ్ హామ్‌లోని హయత్ రీజెన్సీ హోటల్‌లో బసచేసివుంది. ఈ జట్టుతో పాటు.. ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. 
 
అయితే, టీమిండియా ఆటగాళ్లు బసచేసిన నక్షత్ర హోటల్‌లో ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి కలకలం సృష్టించారు. ఆటగాళ్లను, వారి కుటుంబసభ్యులను ఫొటోలు తీస్తూ హోటల్‌లో ఇబ్బందికర వాతావరణం సృష్టించారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఆటగాళ్లు ఉంటున్న గదుల చుట్టూ తిరుగుతూ, తీవ్ర అసౌకర్యానికి గురిచేశారు. 
 
దీంతో అప్రమత్తమైన భారత క్రికెట్ జట్టు సభ్యులు మేనేజ్‌మెంట్‌కు సమాచారం అందించగా, మేనేజ్‌మెంట్ వెంటనే స్పందించి హోటల్ యాజమాన్యానికి గట్టిగా ఫిర్యాదు చేసింది. దాంతో, హోటల్ యాజమాన్యం వెంటనే రంగంలోకి దిగి ఆ ముగ్గుర్ని తీవ్రంగా హెచ్చరించి అక్కడినుంచి పంపించివేసింది. ఈ ఘటన ఆటగాళ్ళలో ఆందోళన రేకెత్తించింది.