నేను ఔటా..? నాటౌటా..? అంటూ అసహనం వ్యక్తం చేసిన రోహిత్ శర్మ (video)
భారత్-వెస్టిండీస్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. భారత్ ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ క్యాచ్ ఔట్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయంపై విపరీతమైన చర్చ జరుగుతోంది.
డీఆర్ఎస్ టెక్నాలజీ, అంపైర్ నిర్ణయం పట్ల క్రికెటర్లు మరియు విశ్లేషకులు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. విండీస్ బౌలర్ కీమర్ రోచ్ విసిరిన బంతిని ఆడబోతుండగా బంతి రోహిత్ ప్యాడ్‌ను తాకి కీపర్ చేతిలో పడింది. విండీస్ అప్పీల్ చేయగా అంపైర్ తిరస్కరించడంతో ఆ జట్టు రివ్యూ కోరింది.
అయితే అంపైర్ దానిని థర్డ్ అంపైర్‌కి రిఫర్ చేయగా, ఔట్ అని సంకేతం వచ్చంది. అసలు బంతి, బ్యాట్‌కు మధ్య కొంత ఖాళీ ఉన్నట్లు క్లియర్‌గా కన్పిస్తున్నప్పటికీ తనను ఔట్‌గా ప్రకటించారని రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేసాడు.
తాను ఔట్ కాదంటూ నిరూపించుకోవడానికి రోహిత్ ఇవాళ తన ట్విట్టర్‌లో రీప్లే ఫోటోలను షేర్ చేసాడు. బంతి బ్యాట్‌కు తాకినట్లు స్పష్టంగా కనిపించలేదు. దీనిపై పూర్తి క్లారిటీ లేకపోయినా మూడో అంపైర్ ఔటివ్వడం పట్ల అంతా అవాక్కయ్యారు. దీంతో రోహిత్ శర్మ తీవ్ర నిరాశగా మైదానం నుండి వెనుదిరిగాడు.