మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 30 జూన్ 2019 (13:36 IST)

ఎక్స్‌రే గదికి రోగిని దుప్పటిపై పడుకోబెట్టి ఈడ్చుకెళ్లిన సిబ్బంది!

నవభారత్ నిర్మాణమే తమ లక్ష్యమని అరిచిగీపెడుతున్న పాలకులకు ఇదో చెంపపెట్టు. నవభారత్ నిర్మాణం సంగతి దేవుడెరుగ... ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీసం రోగిని తీసుకెళ్లేందుకు సరైన స్టెచ్చర్లు, చక్రాల కుర్చీలు కూడా లేవని తేలింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో ప్రతి ఒక్కరూ తలదించుకునే అమానవీయ సంఘటన ఒకటి జరిగింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రోగిని ఎక్స్‌రే గదికి తీసుకెళ్లేందుకు స్ట్రెచ్చర్ లేక దుప్పటిపై పడుకోబెట్టి ఈడ్చుకెళ్లిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జబల్‌పూర్‌లో నేతాజీ సుభాశ్ చంద్రబోస్ మెడికల్ కాలేజీ ఉంది. ఈ వైద్య కాలేజీకి అనుబంధంగా ప్రభుత్వ ఆస్పత్రి కూడా ఉంది. ఇక్కడ జరిగిన ఓ సంఘటను ఓ వార్తా సంస్థ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 
 
ఈ ఆస్పత్రిలో ఓ రోగిని దుప్పటి వంటి చాలీచాలని బట్టపై పడుకోబెట్టి ఆసుపత్రి అటెండెంట్ ఈడ్చుకుని వెళ్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటన జబల్‌పూర్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఓ రోగిని దుప్పటిపై పడుకోబెట్టి, ఎక్స్-రే గదికి ఈడ్చుకుని వెళ్ళడాన్ని చూసినవారికి ఒళ్లంతా జలదరిస్తుంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
 
దీనిపై ఆసుపత్రి డీన్ నవనీత్ సక్సేనా దీనిపై స్పందించారు. ఈ సంఘటన నేపథ్యంలో ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. సమగ్ర దర్యాప్తు తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.