శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 22 జూన్ 2019 (15:12 IST)

ఊపిరివుండగానే వృద్ధుడిని శవపరీక్షకు పంపిన వైద్యులు... ఎక్కడ?

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే వైద్యుల నిర్లక్ష్యం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇపుడు మరోమారు వీరి నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. ఫలితంగా ఓ వృద్ధుడు బతికుండగానే శవపరీక్షకు పంపించారు. 
 
మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సాగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 72 యేళ్ల కాశీరామ్ అనే వృద్ధుడు అనారోగ్యం కారణంగా చేరాడు. అయితే, ఆ వృద్ధుడు వైద్య చికిత్సలకు స్పందించలేదు. దీంతో వృద్ధుడు చనిపోయాడన్న నిర్ధారణకు వచ్చిన వైద్యులు... శవపరీక్షకు పంపించారు. 
 
దీంతో పోలీసు అధికారి అనిల్ మౌర్య ఆసుపత్రిలోని పోస్టుమార్టం విభాగానికి చేరుకున్నారు. ఈ సమయంలో కాశీరామ్ శ్వాస తీసుకుంటుండటాన్ని మౌర్య గుర్తించారు. దీంతో వెంటనే కాశీరామ్‌ను తిరిగి ఆసుపత్రి వార్డులోకి తరలించి అత్యవసర చికిత్స ప్రారంభించారు. అయితే, ఆ వృద్ధుడు చికిత్స ఫలించక ప్రాణాలు విడిచాడు. 
 
ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్ఆర్ రోషన్ మాట్లాడుతూ ఈ ఘటన వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని స్పష్టం చేశారు. దీనిపై విచారణ చేపట్టి, ఇందుకు కారకులైన వైద్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.