కుక్కర్లో చపాతీలను కుక్ చేసిన మహిళ.. వీడియో వైరల్
Chapathi
ఈ వైరల్ క్లిప్‌ను గమనిస్తే.. ఆ మహిళ తన వంట గదిలో స్టవ్ వెలిగించి దానిపై ఖాళీ ప్రెజర్ కుక్కర్ పెట్టింది. వేడి అయ్యే వరకు వేచి ఉంచి, అనంతరం రుద్దిన మూడు చపాతీలను కుక్కర్లో వేసి మూత పెట్టింది. హై ఫ్లేమ్‌లో వాటిని ఉడికించింది. ఆ తరువాత రోలింగ్ పిన్ సహాయంతో మూడు చపాతీలు ఒకదాని తర్వాత మరోకటి తీయడంతో వీడియో ముగుస్తుంది.
ప్రెజర్ కుక్కర్ లిడ్‌తో పాటు వెయిటింగ్ వాల్వ్, గాస్కెట్ సీలింగ్ రింగును కూడా ఆమె ఉంచింది. అంతేకాకుండా మూతను గట్టిగా మూసివేసి మూడు నిమిషాల పాటు వేచి ఉండాలని వీడియోలో సూచించింది.
కొంత సమయం తర్వాత ప్రెజర్ కుక్క మూత తెరిచి స్క్రిమ్మర్ సహాయంతో చపాతీలను ఒకదాని తర్వాత మరోకటి బయటకు తీసి ప్లేటులో ఉంచింది. చపాతీలను ఈ రకంగా కూడా వండుకోవచ్చని ఆమె తెలియజేసింది.
వీడియోను గమనిస్తే.. పెనంపై వండిన చపాతీలకు, కుక్కర్లో వండిన వాటికి ఏ మాత్రం తేడా లేనట్లు కనిపిస్తుంది. ఈ వీడియో బ్యాచిలర్లకు బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ వంట వీడియో సామాజిక మాధ్యమాల్లో చాలా మందికి విపరీతంగా నచ్చింది. సోషల్ మీడియాలో నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.
