ఔను... పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి - సోము వీర్రాజు వ్యాఖ్యలను సమర్థిస్తున్నా: జీవీఎల్
ఫోటో కర్టెసీ- ఫేస్ బుక్
తిరుపతి ఉపఎన్నికల్లో ఓటు అడిగే హక్కు తమకే ఉందన్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధిపై చర్చకు వైసిపి, టిడిపి సిద్ధమా అని ప్రశ్నించారు. అభివృద్ధి అంతా కేంద్రం చేస్తే వైసిపి ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. తిరుపతి ఎంపీ అయినవాళ్లు ఎప్పుడూ ఏమీ చేసింది లేదని.. బిజెపి చేసిన అభివృద్ధి, గత పాలకుల వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు.
సీఎం జగన్‌కి వ్యక్తిగత సేవలు అందించిన వ్యక్తి... ఎంపీ పోటీకి అర్హుడా అంటూ ప్రశ్నించారు. వ్యక్తిగత సేవలు చేసిన వారికి నామినేటేడ్ పోస్టులు ఇచ్చేందుకు చాలా ఉన్నాయన్నారు. జగన్ సేవ వర్సెస్ జనం సేవ దేన్ని ఎంచుకోవాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. విజయసాయి రెడ్డి.. సోము వీర్రాజుపై చేసిన ట్వీట్ వైసిపి భయాన్ని స్పష్టం చేస్తోందన్నారు.
21 మంది వైసిపి ఎంపీలు చేయలేనిది 22వ ఎంపీ చేయగలడా అంటూ ప్రశ్నించారు. బిజెపి అభ్యర్థి రత్నప్రభ విజయం తిరుపతి అభివృద్ధికి సోపానమన్నారు. అవినీతి గురించి వైసిపి నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.
